IND VS NZ 1st ODI: Kohli Bowled By Mitchell Santner At 8 Runs, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IND VS NZ 1st ODI: ఊరించి ఉసూరుమనిపించిన కోహ్లి.. క్లీన్‌ బౌల్డ్‌

Jan 18 2023 3:36 PM | Updated on Jan 18 2023 3:56 PM

IND VS NZ 1st ODI: Kohli Bowled By Santner At 8 Runs - Sakshi

గత 4 వన్డేల్లో 3 సెంచరీలు బాది భీభత్సమైన ఫామ్‌లో ఉండిన టీమిం‍డియా మాజీ కెప్టెన్‌, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 18) జరుగుతున్న తొలి వన్డేలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. కోహ్లి.. ఈ మ్యాచ్‌లోనూ భీకర ఫామ్‌ను కొనసాగించి మరో సెంచరీ (75వ అంతర్జాతీయ శతకం) చేస్తాడని ఫ్యాన్స్‌ గంపెడాశలు పెట్టుకోగా, ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి.

ఈ ఇన్నింగ్స్‌లో 10 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. బౌండరీ సాయంతో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి మిచెల్‌ సాంట్నర్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. అప్పటి దాకా సందడి సందడిగా ఉండిన ఉప్పల్‌ మైదానంలో కోహ్లి ఔట్‌ అయిన వెంటనే నిశబ్దం ఆవహించింది. కోహ్లి.. తన 47వ వన్డే శతకాన్ని తమ వద్ద చేస్తాడని గంపెడాశలు పెట్టుకున్న హైదరాబాద్‌ వాసులు.. కోహ్లి తక్కువ స్కోర్‌కు ఔట్‌ కావడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. కోహ్లి ఔటైన కొద్ది సేపటికే ఇషాన్‌ కిషన్‌ కూడా ఔట్‌ కావడంతో టీమిండియా 19.4 ఓవర్లలో 110 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement