FIH Pro League: ఫ్రాన్స్‌ చేతిలో భారత్‌ ఓటమి  | FIH Pro League: Indian Men Hockey Team Lost Match To France By 2 5 | Sakshi
Sakshi News home page

FIH Pro League: ఫ్రాన్స్‌ చేతిలో భారత్‌ ఓటమి 

Feb 13 2022 8:16 AM | Updated on Feb 13 2022 8:19 AM

FIH Pro League: Indian Men Hockey Team Lost Match To France By 2 5 - Sakshi

FIH Pro League: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికాలోని పాచెఫ్‌స్ట్రోమ్‌లో శనివారం జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలో టీమిండియా 2–5 గోల్స్‌ తేడాతో ఫ్రాన్స్‌ చేతిలో పరాజయం పాలైంది. భారత్‌ తరఫున జెర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (23వ ని.లో), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (57వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆడనుంది.  

సాకేత్‌ మైనేని జంటకు డబుల్స్‌ టైటిల్‌
భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని తన కెరీర్‌ లో తొమ్మిదో ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ సాధించాడు. శనివారం ముగిసిన బెంగళూరు ఓపెన్‌ టోర్నీలో సాకేత్‌–రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) జంట విజేతగా నిలిచింది. హుగో గ్రెనియర్‌–అలెగ్జాండర్‌ ముల్లర్‌ (ఫ్రాన్స్‌) జోడీతో జరిగిన ఫైనల్లో సాకేత్‌–రామ్‌కుమార్‌ ద్వయం 6–3, 6–2తో గెలిచింది. కేవలం 45 నిమిషాల్లో ముగిసిన ఈ ఫైనల్లో సాకేత్‌ జంట తొమ్మిది ఏస్‌లు సంధించింది.  

చదవండి: IPL 2022 Auction: వేలంలో షాకింగ్‌ ఘటన.. కుప్పకూలిన ఆక్షనీర్‌

Advertisement
 
Advertisement
Advertisement