టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జ‌ట్టులోకి 19 ఏళ్ల యువ సంచ‌ల‌నం | England call up Eddie Jack as cover for Josh Tongue ahead of India Test series | Sakshi
Sakshi News home page

IND vs ENG: టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జ‌ట్టులోకి 19 ఏళ్ల యువ సంచ‌ల‌నం

Jun 11 2025 4:23 PM | Updated on Jun 11 2025 5:33 PM

England call up Eddie Jack as cover for Josh Tongue ahead of India Test series

భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల‌ టెస్టు సిరీస్ ఆరంభానికి మ‌రో ఎనిమిది రోజుల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదిక‌గా జూన్ 20 నుంచి 24 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. అయితే తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

భార‌త్‌తో తొలి టెస్టు కోసం 19 ఏళ్ల యువ ఫాస్ట్ బౌల‌ర్ ఎడ్జీ జాక్స్‌కు ఇంగ్లండ్ సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు. తొలి టెస్టుకు ఎంపికైన మరో యువ పేస‌ర్ జోష్ టాంగ్ గాయ‌ప‌డ‌డంతో ప్రత్యామ్నయంగా జాక్స్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇండియా-ఎతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనాధికారిక సిరీస్‌లో ఇంగ్లండ్ లయన్స్ తరపున జాక్స్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.

నాలుగు ఇన్నింగ్స్‌ల‌లో 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్‌, య‌శ‌స్వి జైశ్వాల్‌ను జాక్స్ ఔట్ చేశాడు. కాగా జాక్స్ త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం రెండు ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడాడు. అవికూడా ఇండియా-ఎపై ఆడిన‌వే.

వోక్స్‌పైనే భారం..
కాగా తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం చాలా బ‌ల‌హీనంగా క‌న్పిస్తోంది. ఇప్ప‌టికే గాయం కార‌ణంగా మార్క్‌వుడ్‌, ఓలీ స్టోన్ ఈ సిరీస్‌కు దూరం కాగా.. అటిన్కిస‌న్‌, ఆర్చ‌ర్ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొన‌సాగుతోంది.

ఇప్పుడు ఈ జాబితాలోకి టంగ్ కూడా చేర‌డం ఇంగ్లీష్ జ‌ట్టు మెనెజ్‌మెంట్‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఇంగ్లండ్ బౌలింగ్ భారాన్ని క్రిస్ వోక్స్ మోయ‌నున్నాడు. వోక్స్, కార్స్‌, సామ్ కుక్ ఫ్రంట్‌లైన్ సీమ‌ర్ల‌గా ఉన్నారు.
భార‌త్‌తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జ‌ట్టు
బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్, జాక్‌
చదవండి: WTC Final: కోహ్లి ఆల్‌టైమ్‌ రికార్డుపై కన్నేసిన ట్రవిస్‌ హెడ్‌

Advertisement
 
Advertisement
Advertisement