మీ బిడ్డగా సేవలందిస్తా

పులిమామిడి రాజు  - Sakshi

రాబోయే ఎన్నికల్లో మీ బిడ్డగా ఆశీర్వదించి మరోసారి గెలిపిస్తే మీ సేవకుడిగా పనిచేస్తానని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.

వివరాలు IIIలో u

బీజేపీ టికెట్‌ రాజుకే..

అనూహ్య పరిణామాల మధ్య బీ–ఫారం

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి బీజేపీ అభ్యర్థిత్వం అనూహ్య పరిణామాల మద్య ఆ పార్టీ నాయకులు పులిమామిడి రాజుకే దక్కింది. నామినేషన్లు దాఖలుకు చివరి రోజైన శుక్రవారం ఆయనకు పార్టీ అధినాయకత్వం బీ–ఫారం అందజేసింది. తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పులిమామిడి రాజు జిల్లా వెయిట్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి సదాశివపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. కొన్ని నెలల క్రితమే ఆయన బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. జిల్లాలో ముదిరాజ్‌ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉండటంతో ఆ పార్టీ అధినాయకత్వం రాజు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పులిమామిడి రాజు పీఎంఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కూడా చేశారు. ఈ మేరకు రాజు శుక్రవారం బీజేపీ బీ–ఫారంతో నామినేషన్‌ దాఖలు చేశారు.

బయోడేటా

పేరు : పులిమామిడిరాజు

తల్లిదండ్రులు : పులిమామిడి మల్లయ్య, భాగమ్మ

స్వస్థలం : సదాశివపేట

పదవులు : తెలంగాణ ముదిరాజ్‌

మహాసభ జిల్లా అధ్యక్షుడు

సదాశివపేట మున్సిపల్‌ కౌన్సిలర్‌

వెయిట్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు

పీఎంఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top