జేవీ చలపతిరావుకు మాతృవియోగం
సిరిసిల్ల: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రెడ్ జేవీ చలపతిరావు తల్లి సూరమ్మ(90) బుధవారం హైదరాబాద్‌లోని అల్వాల్‌లో మరణించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం తిమ్మాపూర్‌కు చె ందిన జువ్వాడి సూరమ్మ, మురళీమనోహర్‌రావు దంపతు ల కొడుకు చలపతిరావు. ఆయన విద్యార్థి దశలోనే ఉద్యమాల వైపు సాగాడు. సీపీఐ(ఎంఎల్) జనశక్తి ఉద్యమంలో కీలక నాయకుడిగా ఎదిగారు. మూడు దశాబ్దాలపాటు అజ్ఞాత జీవితం గడిపారు. 1994లో అజ్ఞాతవాసం వీడి, సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన తల్లి సూరమ్మ సిరిసిల్ల ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ముందునిలిచారు. సూరమ్మ హైదరాబాద్‌లోని తన చిన్నకుమారుడి ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు గురువారం ఉదయం అల్వాల్ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. సూరమ్మ మృతిపై రాజన్నసిరిసిల్ల జిల్లా సీపీఐ కార్యదర్శి గుంటి వేణు సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment