జిల్లాలోని ఓ మండల స్థాయి అధికారి విఽధి నిర్వహణలో సత్ఫలితాలు సాధించారు. ఆయన ప్రతిభను గౌరవించాల న్న ఉద్దేశ్యంతో ఆ మండలంలోని ప్రజా ప్రతినిధులు, కిందిస్థాయి సిబ్బంది సదరు అధికారిని సన్మానించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ అధికారి రాజకీయ నాయకులతో సన్మా నం పొందడంపై ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన అధికారులు మోడల్ కోడ్ కండక్ట్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకున్నారు.
వేములవాడకు చెందిన చెందిన ఓ వ్యాపారి తన గుమస్తాతో గత నెలలో బ్యాంకులో జమ చేసేందుకు రూ.5.67 లక్షలు పంపించాడు. ఎప్పటిలాగే సదరు వ్యక్తి సూపర్‌మార్కెట్ ఖాతాలో జమ చేయడానికి వెళ్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో డబ్బులు పట్టుబడ్డాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన పేరుతో అధికారులు ఆ నగదును సీజ్ చేసి సదరు గుమస్తాపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment