ఎములాడలో ట్రాఫికర్
వేములవాడ ప్రొఫైల్
బ్రిడ్జి నుంచి గుడి వరకు మెయిన్ రోడ్డు 800 మీటర్లు
గుడి నుంచి పోలీస్‌స్టేషన్ వరకు మెయిన్ రోడ్డు 800 మీటర్లు
రోడ్డు విస్తరణ చేపట్టాల్సిన పొడవు 1,600 మీటర్లు
రోడ్ల విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులు 439 మంది
చేపట్టాల్సిన రోడ్ల విస్తరణ 80 ఫీట్లు
పట్టణ జనాభా : 50 వేలు
నిత్యం వచ్చే భక్తులు 30వేల నుంచి 40 వేలు
ప్రస్తుతం ఉన్న మెయిన్ రోడ్డు 20 నుంచి 25 ఫీట్లు
● మెయిన్‌రోడ్డుకు మోక్షమెప్పుడో? ● మార్కింగ్ చేయడం.. వదిలేయడం
● అవస్థలు పడుతున్న స్థానికులు, భక్తులు
తరచూ ట్రాఫిక్ జామ్
రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వ్యక్తిగత వాహనాల్లో వస్తుండడంతో తిప్పాపూర్ నుంచే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఆది, సోమవారాల్లో ఈ సమస్య మరింత జఠిలమవుతుంది.
వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రం, దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం, భక్తుల రాక పెరిగిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇరుకై న రోడ్లతో ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా వేములవాడలో రోడ్ల విస్తరణ పనులు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. అధికారులు ఇప్పటికే పలుమార్లు సర్వే చేసి, మార్కింగ్ చేశారు. అయితే విస్తరణ పనులు మాత్రం చేపట్టడం లేదు.
●
కొలతలు తీయడం.. ప్రకటనలు చేయడం
వేములవాడ ప్రధానరోడ్డు విస్తరించాల్సిన అవసరం ఉంది. బ్రిడ్జి నుంచి రాజన్నగుడి, రాజన్న గుడి నుంచి భీమేశ్వరాలయం మీదుగా బద్దిపోచమ్మ గుడి నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ఉన్న రోడ్డును 80 ఫీట్లతో విస్తరించేందుకు అధికారులు మార్కింగ్ చేశారు. పనులు చేపట్టేందుకు వీటీడీఏ నుంచి నిధులు సైతం సమకూర్చినట్లు తెలిసింది. కానీ సమస్య పరిష్కారం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment