ఆర్టీసీ బస్సు లారీ ఢీ.. తప్పిన ప్రమాదం | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు లారీ ఢీ.. తప్పిన ప్రమాదం

Published Thu, Nov 16 2023 1:52 AM

 ఢీకొన్న ఆర్టీసీ బస్సు, లారీ - Sakshi

ముత్తారం:కాసార్లగడ్డ బస్టాండ్‌లో బుధవారం ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఓడెడ్‌ నుంచి గోదావరిఖనికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఓడెడ్‌కు వైపు వస్తున్న లారీ అదుపుతప్పి ఢీకొనడంతో బస్సు అద్దాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కాసార్లగడ్డ – అడవిశ్రీరాంపూర్‌ చౌరస్తా, ప్రభుత్వ ఆస్పత్రి, మంథని–ఓడెడ్‌ ఆర్‌ అండ్‌ బీ రోడ్డుకు ఇరువైపులా ఇరుకుగా ఉండడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. రోడ్డును ఆక్రమించిన దుకాణాదారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Advertisement
Advertisement