ఈ జాగ్రత్తలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Published Thu, Jun 13 2024 12:36 AM | Last Updated on Thu, Jun 13 2024 12:46 AM

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

● ఇంట్లో నాణ్యమైన విద్యుత్‌ ఉపకరణాలు, ఐఎస్‌ఐ మార్క్‌ ఉన్న పరికరాలు, విద్యుత్‌ తీగలు మాత్రమే వాడాలి.

● వర్షం పడే సమయంలో తడికాళ్లు, తడి చేతులతో తీగలు, స్విచ్‌లను ముట్టుకోవద్దు.

● పిడుగులు పడేటపుడు, గాలీవాన సమయంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో, విద్యుత్‌ తీగల కింద ఉండకుండా జాగ్రత్త వహించాలి.

● పొలాల్లో మోటారు వేసేప్పుడు రైతులు రబ్బరు చెప్పులు, గ్లౌజులు వేసుకోవాలి.

● విద్యుత్‌ వైర్లు పొలాల్లో లేకుండా చూసుకుంటే మంచిది.

● పొలంగట్ల వెంట విద్యుత్‌ వైర్లు ఉంటే రాత్రి సమయంలో పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తలు పాటించాలి.

● వర్షం కురుస్తున్న సమయంలో ఇంట్లో ఫ్రిజ్‌, హీటర్‌, టీవీ, గీజర్‌ స్విచ్‌ ఆన్‌ చేయాల్సి వస్తే బోర్డులపైనా తేమ లేకుండా చూసుకోవాలి.

● వర్షం కురిసే సమయంలో, వర్షం పడిన తర్వాత రహదారుల వెంట ఉండే విద్యుత్‌ స్తంభాలను తాకరాదు.

● ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు పోతే కరెంట్‌ ఉండదని మరమ్మతులు చేయకూడదు.

● మోటార్లను నేలపై కాకుండా దిమ్మెలపై ఏర్పాటు చేయాలి, స్టార్టర్‌ బోర్డును తడవకుండా చూడాలి.

● మోటారు పాడైతే మెకానిక్‌తోనే మరమ్మతులు చేయించాలి. సొంతగా ప్రయత్నించకూడదు.

● స్టార్టర్‌ వైర్లు నేల మీద ఉంచకూడదు. స్టార్టర్‌పై మూత తీసి వాడకూడదు.

● సర్వీసు వైర్లు, మోటార్లకు వాడే తీగలు నాణ్యమైనవి వాడాలి. అతుకులు లేకుండా చూసుకోవాలి.

● సబ్‌మెర్సిబుల్‌ మోటారు వైర్లు కొద్దిమాత్రం తెగినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

● ఎవరైనా విద్యుత్‌ షాక్‌కు గురైతే వెంటనే స్విచ్‌ ఆఫ్‌ చేసి పొడవైన ప్లాస్టిక్‌ పైపు, కర్రతో వ్యక్తిని తప్పించాలి. తగిన వైద్య సహాయం అందించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement