ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన వైఎస్సార్‌సీపీ | Ysrcp Accepted Challenge Of Mla Mekapati Chandrasekhar Reddy | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన వైఎస్సార్‌సీపీ

Mar 30 2023 6:40 PM | Updated on Mar 30 2023 7:15 PM

Ysrcp Accepted Challenge Of Mla Mekapati Chandrasekhar Reddy - Sakshi

ఉదయగిరిలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ను వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్వీకరించాయి.

సాక్షి, నెల్లూరు: ఉదయగిరిలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ను వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్వీకరించాయి. వైఎస్సార్‌సీపీ నేత మూలే వినయ్‌రెడ్డి వర్గీయులు బస్టాండ్‌ సెంటర్‌లో కూర్చున్నారు. అవినీతి ఎమ్మెల్యే, పార్టీ ద్రోహి మేకపాటి అంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే మేకపాటి తన వద్ద డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా అంటూ మూలే వినయ్‌రెడ్డి సవాల్‌ విసిరారు. మేకపాటికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ ద్రోహి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఉదయగిరి నుంచి చంద్రశేఖర్‌రెడ్డి వెళ్లిపోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, వైఎస్సార్‌సీపీ నేతలపై నోరు పారేసుకున్న మేకపాటి.. వారిపై రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు. మేకపాటి చేసిన సవాల్‌తో వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు.

చదవండి: కోటంరెడ్డి బ్రదర్స్‌ కోసం సొంతవాళ్లకే టీడీపీ వెన్నుపోటు.. పాపం అజీజ్‌!

Advertisement
 
Advertisement
Advertisement