ఆ ‘3వేల కోట్లను ప్రజలకే అందిస్తాం’.. బీజేపీ అభ్యర్ధికి ప్రధాని హామీ | Pm Modi Working Rs3,000 Crore Looted From Poor People In West Bengal | Sakshi
Sakshi News home page

ఆ ‘3వేల కోట్లను ప్రజలకే అందిస్తాం’.. బీజేపీ అభ్యర్ధికి ప్రధాని హామీ

Mar 27 2024 3:56 PM | Updated on Mar 27 2024 8:16 PM

Pm Modi Working Rs3,000 Crore Looted From Poor People In West Bengal - Sakshi

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధికి కీలక హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో అవినీతి పరులు దోచుకున్న పేద ప్రజల సొమ్ముని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసిందని, తిరిగి ఆ సొమ‍్మును వారికే చెందేలా కృషి చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.  

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌లోని ఆయా లోక్‌సభ స్థానాల బీజేపీ అభ్యర్ధులకు స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు. ఎన్నికల ప్రచారంపై ఆరా తీస్తున్నారు. మంగళవారం సందేశ్‌ఖాలీ బాధితురాలు, బసిర్‌హట్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి రేఖ పత్రతో మాట్లాడిన మోదీ.. ఇవాళ పశ్చిమ బెంగాల్‌ కృష్ణానగర్‌ లోక్‌సభ అభ్యర్ధి, తృణముల్‌ కాంగ్రెస్‌ మహిళా నేత మహువా మొయిత్రాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి రాజమాత అమ్రితా రాయ్‌తో మాట్లాడారు. 

ఈ సందర్భంగా పేదల ప్రజల సొమ్మును అవినీతిపరులు దోచుకున్నారని ప్రధాని అన్నారు. వారి నుంచి ఈడీ జప్తు చేసిన ఆస్తులు, డబ్బులు తిరిగి వారికే చెందేలా చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తున్నట్లు అమృతా రాయ్‌తో ప్రధాని మోదీ చెప్పారంటూ బీజేపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు, ఈడీ అటాచ్‌ చేసిన సొమ్ము విషయంలో తన స్టాండ్‌ ఏంటో పశ్చిమ బెంగాల్‌ ప్రజలకు అమ్రితా రాయ్‌ చెప్పాలని ప్రధాని మోదీ కోరారు. త్వరలో అందుకు తగ్గట్లుగానే చట్టాపరమైన మార్గాల ద్వారా పేద ప్రజలకు సొమ్ము చేరవేస్తామని మోదీ.. అమ్రితా రాయ్‌కు చెప్పినట్లు సమాచారం.  

పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అమ్రితా రాయ్‌తో మాట్లాడే సమయంలో ప్రధాని మోదీ ప్రస్తావన తెచ్చిన ఆ రూ. 3 వేల కోట్లు.. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో పలువురు ఉద్యోగాల కోసం లంచంగా చెల్లించిన మొత్తం సొమ్మేనని, ఆ సొమ్మును ఈడీ అటాచ్‌ చేసింది. తిరిగి ఎవరైతే జాబ్‌ కోసం డబ్బులు చెల్లించారో వారికే ఆ సొమ్ము అందించనున్నట్లు కమలం నేతలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement