మహిళల పట్ల రేవంత్‌, భట్టి ప్రవర్తన అవమానకరం: కేటీఆర్‌ | KTR Serious Comments On Revanth And Batti Vikramarka | Sakshi
Sakshi News home page

మహిళల పట్ల రేవంత్‌, భట్టి ప్రవర్తన అవమానకరం: కేటీఆర్‌

Aug 1 2024 8:31 AM | Updated on Aug 1 2024 9:15 AM

KTR Serious Comments On Revanth And Batti Vikramarka

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్‌ ప్రవర్తనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

కాగా, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా.. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎంల ప్రవర్తన అత్యంత అవమానకరమైంది. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి వీరు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలి. వారిపట్ల గౌరవంగా ఉండాలి. ఈ రకమైన ప్రవర్తన సరికాదు. కాంగ్రెస్ నేతల నుండి ఈ రకమైన వ్యాఖ్యలు కేవలం మన నాయకులపైనే కాకుండా మహిళలందరి పట్ల వారి ధిక్కారాన్ని, అగౌరవాన్ని తెలియజేస్తున్నాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement