సుపరిపాలన సభలో పవన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు | Deputy Cm Pawan Kalyan Made Provocative Comments | Sakshi
Sakshi News home page

సుపరిపాలన సభలో పవన్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

Jun 23 2025 7:46 PM | Updated on Jun 23 2025 8:05 PM

Deputy Cm Pawan Kalyan Made Provocative Comments

సాక్షి, అమరావతి: ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు’ సభలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.  

‘నేనూ సినిమాల నుంచే వచ్చా.పిచ్చి వేషాలు వేయకండి .. కాలుకు కాలు మక్కెలు ఇరగదీస్తాం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు..మేం ఇక్కడ సరదాగా లేం. చాలా దెబ్బలు తిని వచ్చాం .. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టకండి.

సజ్జనుడికి కోపం వస్తే అడవి కూడా ఆపలేదు. మాది మంచి ప్రభుత్వం .. మెతక ప్రభుత్వం కాదు. పిచ్చి వేషాలు వేస్తే .. తొక్కి నారతీస్తాం అంటూ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  
 

Advertisement
 
Advertisement
Advertisement