బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా: చంపయీ సోరెన్‌ | Champai Soren confirms to join BJP on August 30 | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా: చంపయీ సోరెన్‌

Aug 27 2024 1:26 PM | Updated on Aug 27 2024 3:20 PM

Champai Soren confirms to join BJP on August 30

ఢిల్లీ: జార్ఖండ్‌ ఆదివాసీ నేత, మాజీ సీఎం చంపయీ సోరెన్‌ తాను బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లు స్వయంగా వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ తొలుత క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొందామని అనుకున్నా. ఈ నెల 18న ఢిల్లీకి వచ్చినప్పుడే నా వైఖరిని స్పష్టంగా చెప్పాను. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించా. కానీ, ప్రజల మద్దతు నాకు ఉంది. అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయిం తీసుకున్నా’ అని చంపయీ స్పష్టం చేశారు.

 

ఇక.. ఆయన ఆగస్టు 30న బీజేపీలో అధికారికంగా  చేరనున్నారని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే.  చంపయ్‌  కేంద్రమంత్రి అమిత్‌ షాతో సమావేశం అయ్యాక పార్టీలో చేరిక విషయంలో నిర్ణయం తీసుకున్నారని హిమంత తెలిపారు.

చదవండి:  బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన చంపయీ సోరెన్‌!

 

Advertisement
 
Advertisement
Advertisement