April 13th : ఏపీ ఎన్నికల సమాచారం.. | AP Elections Today Political News Updates And Headlines On April 13th In Telugu - Sakshi
Sakshi News home page

April 13th AP Election News Updates: ఏపీ ఎన్నికల సమాచారం.. ఎప్పటికప్పుడు

Published Sat, Apr 13 2024 6:39 AM

ap elections 2024 political news telugu april 13th updates - Sakshi

April 13th AP Elections 2024 News Political Updates..

08:40PM, April 13th 2024

నెల్లూరు:

నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి

  • రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కోటంరెడ్డి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని ద్వజం
  • రూరల్ నియోజకవర్గ ప్రజలను పీడించి.. బిల్డర్స్ ను బెదిరించి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మండిపాటు
  • ఎన్నికల సమయంలో కోటంరెడ్డి.. జిమ్మిక్కుల రాజకీయం చేస్తారని.. ప్రజలెవ్వరు నమ్మొద్దని  విజ్ఞప్తి.
     

08: 15PM, April 13th 2024

ఏలూరు జిల్లా: 

నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిపై ముద్ర బోయిన వెంకటేశ్వరరావు ఫైర్

  • నేను వైఎస్సార్‌సీపీకి  అమ్ముడుపోయానని పార్థసారథి వ్యాఖ్యానించటం పద్ధతి కాదు
  • ఇప్పుడు నువ్వు టీడీపీకి, గతంలో నీ తండ్రి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అమ్ముడుపోయారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు
  • పార్థసారథి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ప్రజలే నీకు బుద్ధి చెబుతారు
  • నా కార్యకర్తలని ఫోన్లో బెదిరించటం పద్ధతి కాదు 
  • ఇద్దరం ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పెనమలూరులో గాని నూజివీడులో  గాని పోటీ చేద్దాం రా
  • రెండు చోట్ల నా మీద ఒక ఓటు ఎక్కువ వచ్చినా నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా
  • మళ్లీ నా కార్యకర్తల జోలికి వస్తే నీ ఇంటి ముందు బైఠాయిస్తా
     

03: 15PM, April 13th 2024

తిరుపతి జిల్లా:

తిరుపతిలో వైఎస్సార్‌పీపీలోకి భారీగా చేరికలు

  • రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులై వైఎస్సార్‌సీపీలో చేరిన బిజేపి నాయకులు, నగర యువత
  • తిరుపతి 19వ డివిజన్‌లోని బీజేపీ నాయకులు, నగర యువత  పద్మావతీపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక
  • వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూమన అభియన్‌ రెడ్డి
  • రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలను సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
  • తిరుపతి నగరాభివృద్ధిని చూసి వారంతా వైఎస్సార్‌సీపీలో చేరారు

02: 25PM, April 13th 2024

బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని లేఖ రాశావు మర్చిపోయావా చంద్రబాబు: మంత్రి వేణుగోపాలకృష్ణ

  • ప్రలోభాలు పెట్టి బీసీలను లొంగ తీసుకోవాలనుకున్నావు
  • కులగణన పూలే జయంతి నాడు ప్రకటించాం... సజావుగా పూర్తి చేస్తాం.. కులగణన వివరాలు ప్రజలకు పంపిస్తాం
  • కమిషన్‌లకు కక్కుర్తి పడి  గతంలో నాణ్యత లోపం ఉన్న పనిముట్లను సరఫరా చేసావ్
  •  సామాజిక సాధికారతకు నిలువెత్తు దర్పణం సీఎం జగన్
  • కులగణనకు భారతీయ జనతా పార్టీ అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలి

02: 10PM, April 13th 2024
విశాఖపట్నం:
బొత్స సత్యనారాయణ పాయింట్స్..

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరకు వ్యతిరేకమని కూటమి నేతలు చెప్పగలరా
  • స్టీల్ ప్లాంట్పై తన వైఖరి చెప్పిన తర్వాతే చంద్రబాబు రేపు గాజువాకలో ఓట్లు అడగాలి
  • స్టీల్ ప్లాంట్ డ్రామాలాడుతున్న చంద్రబాబును ప్రజలు నిలదీయాలి
  • టిడిపి జనసేన బీజేపీకీ ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపినట్లే
  • లాబీయింగ్ చేసే సీఎం రమేష్కు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాను
  • అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడానికి స్థానికంగా ఉన్న బీసీ నేత టీడీపీకి దొరకలేదా
  • వాలంటీర్లపై చంద్రబాబు మాటలు చూస్తుంటే నాలిక తాటిమట్ట అనే విధంగా ఉన్నాయి

02: 00PM, April 13th 2024
వైఎస్ఆర్ జిల్లా:
పులివెందులలో షర్మిల, సునీత విమర్శలపై భగ్గుమన్న మహిళా కౌన్సిలర్లు

  • షర్మిల, సునీత విమర్శలను తీవ్రంగా ఖండించిన కౌన్సిలర్లు
  • అక్కచెల్లెల్లు ఇద్దరు కాంగ్రెస్ గెలిస్తే పులివెందులకు ఏం చేస్తారో చెప్పడం లేదు
  • ఎప్పుడు హత్యలు, హంతుకులు అంటూ విమర్శలు చెయ్యడమే పనిగా పెట్టుకున్నారు
  • వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే కారకులైన వారిని శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి
  • అంతేగానీ ఎంపి అవినాష్ రెడ్డి హంతకుడు.. సీఎం వైఎస్ జగన్ కాపాడాడు అంటూ మాట్లాడుతున్నారు
  • షర్మిల ఒక్కరే కాదు.. మేము కూడా వైఎస్ఆర్ కుమార్తెలాంటి వారమే
  • సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధి చూడండి
  • ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలతో ఆదుకున్నారు
  • రాష్టంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పదకాలు అమలువుతుంటే పధకాలు లేవంటున్నారు?
  • ఎంపీ, సీఎంలపై అపనిందలు మోపడం మానుకోండి
  • ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేశాడని అంటున్నారు.. మీరు చూశారా చెప్పండి?
  • మీ లబ్ది కోసం వైఎస్ఆర్ కూతురినని తెలంగాణాకు వెళ్లి పార్టీ పెట్టారు
  • అక్కడ పార్టీ మూసేసి మళ్లీ ఇక్కడికి వచ్చారు
  • మీరు మాట్లాడినంత మాత్రనా ఇక్కడ వినేవారు ఎవరు లేరు
  • మీ నీచపు రాజకీయాలు ఇక్కడ తరం కావు 
  • 2024 ఎన్నికల్లో ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు
  • ఎంపీ అవినాష్రెడ్డి 5 లక్షల మెజార్టీతోను, సీఎం వైఎస్ జగన్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయం

01: 10PM, April 13th 2024
కాకినాడ జిల్లా కాకినాడ:
 మిధున్ రెడ్డి, రిజినల్ కోఆర్డినేటర్ కామెంట్లు

  • పిఠాపురంలో వంగా గీతా బలమైన అభ్యర్ధి
  • పవన్ కళ్యాణ్ రాకముందే ఆమె అక్కడ అభ్యర్ధిగా ఉన్నారు
  • గతంలో ఎమ్మెల్యే గా వంగా గీతా పని చేశారు... నిత్యం ప్రజల్లో ఉంటారు
  •  యిబ్బందులు వస్తే ఎవరూ అందుబాటులో ఉంటారు అని ప్రజలు  కోరుకుంటారు
  • పిలిస్తే పలికే వ్యక్తులకే ప్రజలు మద్దత్తు ఇస్తారు
  • పవన్ కళ్యాణ్ ను వాళ్ళ క్యాడరే చేరుకోలేరు
  • ఆయన ఎక్కడ ఉండాడో తెలియదు.. ఎప్పుడు వస్తాడో తెలియదు
  • పిఠాపురం పై మేము ప్రత్యేక దృష్టి పెట్టానవసరం లేదు
  • 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి
  • పిఠాపురం లో వైఎస్ఆర్ సిపి బలంగా ఉంది
  • పిఠాపురంలో కష్టపడుకొవాల్సింది పవన్ కళ్యాణ్
  • డబ్బులకు ప్రజలు ఓట్లు వెయ్యరు
  • నా సీటు నాకు ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను
  • ఇంత వరకు నేను పిఠాపురం లో అడుగు పెట్టింది లేదు
  • తాను ఓడిపోతే చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ కొన్ని కారణాలు వెతుక్కుంటున్నాడు
  • పవన్ కళ్యాణ్ కోసం పట్టించుకోనవసరం లేదు

01: 00PM, April 13th 2024
విశాఖపట్నం: 
బొత్స సత్యనారాయణ పాయింట్స్..

  • జగన్ ఏదైతే చెప్తారో అదే చేస్తారు.. ఏదైతే చేస్తారో అదే చెప్తారు
  • చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడని నాయకులు
  • బీసీలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి బ్యాక్ బోన్ వంటివారు
  • బలహీన వర్గాలకు రాజ్యాధికారం జగన్ మాత్రమే ఇస్తున్నారు
  • మాత్యకారులను ఎమ్మేల్యేలుగా, మంత్రులుగా చేసే ఒకే ఒక్క నాయకుడు సీఎం జగన్
  • రానున్న ఎన్నికల్లో మత్స్యకారులకు నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు
  • ఒక మత్స్యకారుడిని రాజ్య సభకు పంపించారు
  • బలహీనవర్గాలంటే చంద్రబాబుకు, పవన్కు చిన్న చూపు
  • మాయలు చేసే మాటలు మేము చెప్పము
  • నా రాజకీయ భవిష్యత్తులో జగన్ లాంటి మంచి నాయకుడిని చూడలేదు
  • మన పార్టీ బలహీనవర్గాల పార్టీ అని జగన్ నాతో అనేవారు

12: 30PM, April 13th 2024
చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి

  •  58 నెలల మన పాలనను మీరు చూశారు
  • గత చంద్రబాబు పాలనను మీరు చూశారు
  • నాయకుడి ఎన్నికలో పొరపాటు చేస్తే 
  • మనం చేసేదీ ఏమీ ఉండదు 
  • మనం తీసుకునే నిర్ణయం సరైంది అయితే, మన అడుగులు ముందుకు పడతాయి
  • చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు
  • సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు
  • గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు 
  • చంద్రబాబు గతంలో 98శాతం హామీలను ఎగ్గొట్టారు
  • ఆప్కోకు కూడా చంద్రబాబు బకాయిలు పెట్టారు
  • ఒక్కరికైనా చంద్రబాబు సెంట్ స్థలం ఇచ్చారా?
  • మనం స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు
  • ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారు
  • నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3,706 కోట్లు ఖర్చు చేశాం
  • లంచాలు, వివక్ష లేకుండా నేరుగా ఖాతాల్లో డబ్బు జమ చేశాం
  • నేతన్న నేస్తం కింద రూ.970 కోట్లు అందజేశాం
  • 1.06 లక్షల మందికి లబ్ధి జరిగింది
  • అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేశాం
  • పెన్షన్ రూ.3వేలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదే
  • చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది
  • మంగళగిరిలో చేనేతలు ఎక్కువుగా ఉన్నారని, చేనేత మహిళకు సీటు ఇచ్చాం
  • బీసీలు ఎక్కువగా ఉన్నా... చంద్రబాబు బీసీలకు సీటు ఇవ్వలేదు 
  • కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడా బీసీలకు ఇవ్వరు
  • 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చాం
  • చేనేతలకు రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం
  • రెండు ఎమ్మెల్సీలు చేనేతలకు ఇచ్చాం
  • 8 మంది మున్సిపల్ చైర్మన్లు చేనేతలకు ఇచ్చాం
  • 50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్ ఇచ్చిన ఘనత మనదే
  • దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డు
  • నామినేటెడ్ పదవుల్లోనూ చేనేత వర్గానికి ప్రాధాన్యతనిచ్చాం
  • చేనేత వర్గం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వారికి అండగా నిలిచాం
  • మంగళగిరి నియోజకవర్గంలో 90.1 శాతం లబ్ధి జరిగింది 
  • అక్కా చెల్లెమ్మలకు రూ.1530 కోట్ల లబ్ధి 
  • నాన్ డీబీటీ ద్వారా రూ.735 కోట్ల లబ్ధి 
  • టీడీపీ డబ్బు ఇస్తే తీసుకోండి
  • ఓటు వేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఓటు వేయండి
  • మంచి చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా

12: 00PM, April 13th 2024
విశాఖపట్నం:
వాసుపల్లి గణేష్ పాయింట్స్..

  • చంద్రబాబుకు జగన్కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది
  • సీఎం జగన్ కాలి గోటికి చంద్రబాబు సరిపోడు
  • మత్స్య కారులు తోలు తీస్తానని చంద్రబాబు బెదిరించారు
  • నలుగురు మత్స్య కారులు కు ఎంఎల్ఏ సీట్లు సీఎం జగన్ ఇచ్చారు
  • 50 ఏళ్లకే ఫించన్ ఇస్తున్నారు
  • మత్స్య కారులను చంద్రబాబు మోసం చేశారు
  • మత్స్య కారులు చంద్రబాబు తోలు తీసే రోజులు దగ్గరలో ఉన్నాయి

11:30AM, April 13th 2024
చిత్తూరు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్

  • నా రాజకీయ జీవితంలో ఇంతలా సంక్షేమ కార్యక్రమాలు అందించిన ముఖ్యమంత్రిని చూడలేదు
  • సిఎం శ్రీ వైఎస్ జగన్ కు పోటీగా మరే ముఖ్యమంత్రి నిలవలేరు
  • జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను దోచుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు ది
  • శ్రీ వైఎస్ జగన్ ఎన్నికలలో ఇచ్చిన హామీలు అని నెరవేర్చారు
  • 600 హామీలు ఇచ్చి, గెలిచిన వెంటనే మానిఫెస్టో కూడా కనపడకుండా చేశారు
  • బాబు వస్తె జాబు వస్తుందని చెప్పి, అధికారంలోకి రాగానే 2.5 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు
  • 14 వేల కోట్లు ఉన్న మహిళా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన ఘనుడు చంద్రబాబు 
  • దానికి అదనంగా 10 వేల కోట్లు వడ్డీ కావడంతో సిఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసరా ద్వారా ఆ రుణాలు చెల్లించారు 
  • చంద్రబాబు మన ప్రాంతంలో మొయిస్తున్న మూడు ప్రాజెక్టులు అడ్డుకున్నారు
  • ఎన్నికలు పూర్తి అవగానే ఆ కేసులు గెలిచి మళ్ళీ పనులు చేపడతాం
  • కాంగ్రెస్ పార్టీలో మూడున్నర ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు బిజెపి నుండి ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు
  • జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయిస్తాను, రాష్ట్రాన్ని విడగొడతాను అని డిల్లోలో చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పొందారు
  • హైదారాబాద్ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నేరుగా కమిషన్లు వసూలు చేసిన ఘనుడు కిరణ్ కుమార్ రెడ్డి
  • కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అభివృద్ధిని అడ్డుకున్నారు
  • రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని లేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి
  • అలాంటి వ్యక్తి నేడు బిజెపి నుండి రాజంపేట ఎంపిగా శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పోటీ చేస్తున్నారు
  • నాకంటే కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి మిథున్‌ భారీ మెజారిటీతో గెలిపించాలి 
  • కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తు గా ఓడించాలని ప్రజలే సిద్దం గా ఉన్నారు
  • ఎమ్మెల్యేగా నన్ను, ఎంపిగా శ్రీ మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా
  • మీ రెండు అమూల్యమైన ఓట్లు ఫ్యాన్ గుర్తు పై వేసి భారీ మెజారిటీ అందించాలని కోరుకుంటున్నా

11:00AM, April 13th 2024
విశాఖపట్నం:
విశాఖ సౌత్ నియోజకవర్గంలో మళ్లీ మొదటకి వచ్చిన  జనసేన పరిస్థితి

  • వంశీకృష్ణకు వ్యతిరేకంగా సాదిక్ మీడియా సమావేశం
  • మహ్మద్ సాదిక్ జనసేన నేత పాయింట్స్..
  • సౌత్ నియోజకవర్గంలో వంశీకృష్ణ వెనకబడి ఉన్నారు
  • వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాకెట్లా దూసుకు వెళ్తున్నారు
  • వంశీకృష్ణ సౌత్లో గెలిచే పరిస్థితి లేదు
  • వంశీకృష్ణను సౌత్ నియోజకవర్గం నుంచి తప్పించాలి
  • సౌత్ నియోజకవర్గంలో స్థానికులకే సీటు కేటాయించాలి
  • వంశీ కృష్ణను అభ్యర్థిగా పెట్టడం వల్ల సౌత్లో జనసేన ఓడిపోతుంది

10:30AM, April 13th 2024
శ్రీ సత్యసాయి జిల్లా:
కదిరిలో అభిమానిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ 

  • సెల్ఫీ ఫోటో కోసం వచ్చిన అభిమానిపై బాలకృష్ణ దురుసు ప్రవర్తన 
  • కదిరి నుంచి సైకిల్ రావాలి యాత్ర చేపట్టిన ఎమ్మెల్యే బాలకృష్ణ 
  • బాలకృష్ణ తీరుపై మండిపడుతున్న కదిరి వాసులు

10:00AM, April 13th 2024
తిరుపతి జిల్లా
 చంద్రగిరి పట్టణంలో పచ్చబ్యాచ్(టీడీపీ నాయకులు) బరితెగింపు 

  • అభివృద్ధిని చూసి ఓర్వలేక శిలాఫలకాలు ధ్వంసం 
  • చంద్రగిరి అక్కగార్ల కాలనీ ఎమ్మెల్యే  చెవిరెడ్డి నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు 
  • వాటి పక్కన ఏర్పాటు చేసిన వైఎస్సార్ రోడ్డు శిలాఫలకాలు 
  • రాత్రికిరాత్రి సుమారు నాలుగు ఫలకాలను ధ్వంసం చేసిన పచ్చమూకలు 
  • మండిపడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు

9:30AM, April 13th 2024
విశాఖపట్నం:
వరుదు కళ్యాణి పాయింట్స్..

  • సీఎం జగన్ ప్రచారానికి విశేషమైన స్పందన లభిస్తోంది
  • ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోప తండాలుగా తరలి వస్తున్నారు
  • ఎన్డీఏ అంటే నారా డిజాస్టర్ ఏలియన్స్గా మారింది
  • కాల కూటమి విషంగా చంద్రబాబు, పవన్ పురంధేశ్వరి తయారయ్యారు
  • ఎన్ని కూటములు వచ్చిన సీఎం జగన్ను ఏమీ చేయలేరు
  • వాలాంటిర్లను గంజాయి దొంగలుగా చంద్రబాబు విమర్శించారు
  • 650 హామీలు ఇచ్చి ఒక హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదు
  • తల్లిని తిట్టించిన వారితో పవన్ ఎలా కలుస్తారు

9:00AM, April 13th 2024
విజయవాడ
షర్మిల చూపిస్తున్న సెంటిమెంట్ను నమ్మవద్దు: వైఎస్ విమలారెడ్డి

  • షర్మిలకు లీడర్ షిప్ క్వాలిటీ లేదు
  • మా ఇంటి ఆడపడుచులు ఇంటి గౌరవాన్ని రోడ్డుకు ఈడ్చుతున్నారు
  • మా కుటుంబం పట్ల మాట్లాడుతున్న మాటలను భరించలేకపోతున్నాను
  • షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూశాను
  • అవినాష్ హత్య చేయడం ఎవరైనా చూసారా
  • నిత్యం షర్మిల అవినాష్ను విమర్శిస్తున్నారు
  • వాళ్లే డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు
  • హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు
  • అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా 
  • అవినాష్ 10ఏళ్లు చిన్నవాడు.. అతనికి కుటుంబం ఉంది
  • ఏ పాపం చేయని భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు
  • అవినాష్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారు
  • హత్య చేసిన వాడు సుప్రీంకోర్టు కు వెళ్లి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు
  • మా ఇంట్లో పిల్లలు ఇలా తయారవడం బాధగా ఉంది
  • శత్రువులంటా ఒక్కటైనపుడు కుటుంబసభ్యుడికి తోడుగా ఉండాలి
  • వైఎస్సార్ను ఇప్పటికీ కోట్లాదిమంది గుండెల్లో పెట్టుకున్నారు
  • వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే నాకే ఎక్కువ ఇష్టం
  • షర్మిల, సునీత వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారు
  • జగన్పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు
  • వివేకం, వైఎస్సార్ ఇద్దరూ ఫ్యాక్షన్కి వ్యతిరేకంగా ఉన్నారు
  • రాజారెడ్డిని చంపినపుడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదు
  • ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో అల్లర్లు రేపుతున్నారు
  • మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండి
  • పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడడం తప్పు
  • అంతిమంగా మీరు చేసే పని వల్ల పేదలకు అన్యాయం జరుగుతుంది
  • షర్మిల, సునీత చేస్తున్నది చాలా తప్పు
  • మా వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరూ హర్షించట్లేదు 
  • మీరు చేసే పనుల పట్ల వైఎస్సార్ కూడా సంతోషంగా లేరు
  • వైఎస్సార్ ని ఇబ్బందులు పెట్టినవారు ఇప్పుడు షర్మిలతో ఉన్నారు
  • కడప, పులివెందులలో జరిగిన అభివృద్ధి నీ కళ్ళకు కనిపించట్లేదా 
  • వైఎస్సార్ ఉన్నపుడు వివేకానందరెడ్డి కడప చూసుకున్నారు
  • ఇప్పుడు అవినాష్ కడప చూసుకుంటున్నారు
  • నిస్వార్థంగా పని చేసి కడపను అభివృద్ధిని చేస్తున్నారు
  • మీరెన్ని మాటలు అన్నా అవినాష్ రెడ్డి ఒక్క మాట మాట్లాడటం లేదు
  • శతృవులంటా ఏకమై మీ చుట్టూ చేరారు
  • అవినాష్పై మీకు కోపం పోవాలని ప్రార్థిస్తున్నాను
  • మీకు దైవ భయం కూడా లేకుండా పోయింది
  • షర్మిల ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు
  • నేను షర్మిల, సునీతకు చెప్పాలని చూసినప్పటి నుండి నాతో కూడా మాట్లాడడం మానేశారు
  • షర్మిల, సునీత కు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు
  • గత ఐదేళ్లుగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు
  • డబ్బు కోసమో, పదవులకోసమో నాకు తెలియదు.. కానీ ఏదో ఆశించి ఇదంతా చేస్తున్నారు
  • జగన్ సీఎం అయ్యాక బంధువర్గాన్ని ప్రభుత్వానికి దూరం పెట్టారు
  • బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని చెప్పారు
  • వాళ్ల పనులు అవట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నా
  • అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు
  • అవినాష్ గెలవాలని చివరిరోజువరకూ వివేకానందరెడ్డి పనిచేశారు
  • ప్రజలంతా సీఎం జగన్కి అండగా ఉండాలి
  • మంచి ఏదో చెడు ఏదో కడప ప్రజలు ఆలోచించాలి
  • అవినాష్‌కు, జగన్కు ఓట్లు వేసి గెలిపించాలి
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాలి

8:30AM, April 13th 2024
చంద్రబాబు మోసాల బుర్రకథకి తానా అంటే తందానా: సీఎం జగన్‌

  • చంద్రబాబు మోసాల బుర్రకథకి తానా అంటే తందానా అంటూ ఆయన వదినమ్మ, దత్తపుత్రుడు వంతపాడుతూ రోడ్లపై కనిపిస్తున్నారు. 
  • మీ బిడ్డకి ఓటు వేయడమంటే 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని కొనసాగించమని ఓటు వేస్తున్నట్లు లెక్క. 
  • అదే చంద్రబాబుకి ఓటు వేయడం అంటే దాని అర్థం మీకు జరుగుతున్న మంచి మాకొద్దు అని ఓటు వేసినట్లు అవుతుంది. 
  • ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను.

8:00AM, April 13th 2024
విజయవాడ
బీజేపీకి చందు సాంబశి రావు రాజీనామా

  • ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వైఖరితో బీజేపీలో మరో కీలకనేత రాజీనామా
  • బీజేపీకి చందు సాంబశి రావు రాజీనామా
  • ఏపీ బీజేపీ అధికార ప్రతినిధిగా చందు సాంబశివరావు
  • ఏపీ బీజేపీ పురందేశ్వరి వైఖరి పట్ల బీజేపీలో పెరుగుతున్న అసంతృప్తులు
     

7:40AM, April 13th 2024
తిరుపతి
గ్రాండ్ రిడ్జి హోటల్ లో రాత్రి బిజెపి నేతలకు చేదు అనుభవం

  • ఉమ్మడి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గెలుపుకు సహకరించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం
  • బిజెపి నేతల్ని పట్టించుకోక పోవడంతో రాత్రి అలిగి వెళ్లిపోయిన నాయకులు భానుప్రకాష్, శాంతారెడ్డి
  • ఈరోజు ఉదయం 8.30 గంటలకు బిజెపి నేతలతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్
  • తిరుపతి అసెంబ్లీ స్థానం గెలుపుకు సహకరించాలని టిడిపి, జనసేన పార్టీ నాయకులను కోరిన పవన్
  • పవర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రాకులాట
  •  జనసేన, టిడిపి నాయకులును బ్రతిమలాడిన పవన్
  • తిరుపతి అసెంబ్లీ సీటు చంద్రబాబు స్వయంగా జనసేనకు ఇచ్చారు అని టిడిపి నేతలకు స్పష్టం చేసిన పవన్
  • ఖంగుతిన్న టీడిపి నేతలు

7:20AM, April 13th 2024
ఏపీలో మళ్లీ ఎగిరేది వైయస్‌ఆర్‌సీపీ జెండానే!

  • 21 అసెంబ్లీ సీట్లు తీసుకున్న జనసేన, 10 సీట్లు తీసుకున్న బీజేపీ ఉమ్మడిగా గెలిచేది 4 సీట్లేనని సర్వేలో వెల్లడి 
  • చంద్రబాబు నోటిదురుసే కూటమిని నిండా ముంచబోతున్నట్లు తేల్చిచెప్పేసిన  థర్డ్ విజన్ సర్వే

7:00AM, April 13th 2024
నెల్లూరు జిల్లా..
చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడే వ్యక్తి కాదు: విజయసాయిరెడ్డి 

  • రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి
  • 2024 లో గెలిచిన తర్వాత సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా అభివృద్ధిలో కూడా ముందుంటుంది
  • 2024 -2029 లోపల కందుకూరు నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా కందుకూరులో పరిశ్రమలు  తీసుకువస్తాం
  • ఆ బాధ్యత మాదే

6:50AM, April 13th 2024
క్రెడిబులిటీ అంటే అర్థం తెలియని నాయకుడు చంద్రబాబు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 

  • ఏ విషయంలోనైనా యూ టర్న్ తీసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య

6:40AM, April 13th 2024
మోసాలు కావాలా? మంచి కొనసాగాలా ?

  • పాలకుడు మోసగాడు అయితే బతుకులు అంధకారం అవుతాయి: సీఎం జగన్‌
  • మీరే నా స్టార్‌ క్యాంపైనర్లు..  
  • ప్రతి ఇంటికీ వెళ్లి మంచికి అండగా నిలబడమని కోరాలి 
  • చంద్రబాబుకు ఓటు వేయడమంటే.. మరోసారి మోసపోవడమే 
  • ఇంటికొస్తున్న పింఛన్లు ఆపిన వారితో జరుగుతున్న యుద్ధం ఇది 
  • అబద్ధాల బాబుకు దత్తపుత్రుడు, వదినమ్మ వంత పాట 
  • ముగ్గురూ కలిసి రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు చెబుతున్నారు 
  • ఏటుకూరు మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్‌ జగన్‌ 

6:25AM, April 13th 2024
వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేకపోతున్నాం.. 

  • మన సభలకు స్పందన లేదు.. ఇలాగైతే ఎలా? 
  • కూటమి నేతల తర్జనభర్జన  
  • హాజరైన పవన్, బాబు, బీజేపీ ముఖ్య నేతలు 
  • కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై చర్చ 

6:20AM, April 13th 2024
ఓటమి భయంతోనే ట్యాపింగ్‌ డ్రామా

  • లోకేశ్‌ ఐ ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ టీడీపీ కొత్త నాటకం 
  • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం 
  • అసలు ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వద్ద ట్యాపింగ్‌ చేసే టెక్నాలజీనే లేదు 
  • కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది 
  • ఫోన్‌ ట్యాపింగ్, ఓటర్ల డేటా చౌర్యంలో చంద్రబాబే సిద్ధహస్తుడు 

6:15 AM, April 13th 2024
దొరికాడు దొంగ

  • ‘స్కిల్‌’బెడిసికొట్టి కటకటాల్లోకి..
  • సీమెన్స్‌ కంపెనీ ముసుగులో భారీ దోపిడీ  
  • కుట్రదారు,లబ్దిదారు చంద్రబాబే  
  • A1 చంద్రబాబు అరెస్ట్‌... 
  • అవినీతి నెట్‌వర్క్‌ ద్వారాచంద్రబాబు బంగ్లాకు రూ.241కోట్లు 
  • రాజమహేంద్రవరంసెంట్రల్‌ జైల్లో 52 రోజులు 
  • సీఐడీ దర్యాప్తుల్లో ఆధారాలతోసహా వెల్లడి 
  • 17ఏ కింద చంద్రబాబుకు రక్షణ లభించదన్న సుప్రీంకోర్టు 
  • షెల్‌ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు 
  • కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తరహా లోనే చంద్రబాబుపై ఈడీ కన్ను 
  • ఇదీ చంద్రబాబు అవినీతి ‘స్కిల్‌’

6:00 AM, April 13th 2024
రౌడీఛీటర్‌ చింతమనేని

  • ..ఇది తప్పన్న పాపానికి మహిళా అధికారి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళతాడొకడు..
  • అధిక వడ్డీలకు అప్పులిచ్చి,గడువులోగా తీర్చలేదన్న సాకుతో పక్కకు రమ్మంటున్న వారిని వెనకేసుకొస్తాడు ఇంకొకడు..
  • ప్రకృతిని చెరబట్టడానికే పుట్టామన్నట్లు వ్యవహరిస్తాడు మరొకడు.. చిన్నారులని కూడా చూడకుండా లైంగికంగా వేధించే వెధవలకు అండగా నిలుస్తాడొక దుర్మార్గుడు..
  • ఆడది కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, లేదంటే కడుపైనా చేయాలని నిస్సిగ్గుగా, సందేశంగా చెబుతాడో నేత..
  • ‘అసలు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని స్వయంగా పార్టీ అధినేతే హేళన చేస్తాడు.. ఇలాంటి వాళ్లంతా ప్రజలను ఉద్దరిస్తారట!
  • ప్రజలను పీల్చి పిప్పి చేయడంలో వీరందరిదీ అందె వేసిన చేయి. ఇలాంటి టీడీపీలో ఒక్కో నేతది ఒక్కో చీకటి చరిత్ర.నేటి నుంచి ఒక్కొక్కరి బాగోతాన్ని‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
  • ఎమ్మెల్యే హోదాలో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడి 
  • తహసీల్దార్‌ వనజాక్షి జుట్టుపట్టి ఈడ్చి దాడి చేసిన వైనం.. చంద్రబాబు హయాంలోనే రౌడీషిట్‌
  • అత్యంత వివాదాస్పద రాజకీయ నేతగా ముద్ర 
  • ఎస్సీలకు రాజకీయాలు ఎందుకురా.. అంటూ తీవ్ర స్థాయిలో దూషణ 
  • పవన్‌ కళ్యాణ్‌.. వాళ్ల అన్న చిరంజీవినే గెలిపించలేనివాడు అంటూ వ్యక్తిగత విమర్శలు 
  • ప్రజా ప్రతినిధిగా ఉన్న సమయంలో పోలవరం కుడికాల్వ విధ్వంసం 
  • 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ మింగిన మహా అవినీతిపరుడు 
  • కొల్లేరులోనూ వందల ఎకరాల్లో సొంతంగా అక్రమ సాగు 
  • 1,860 ఎకరాల అక్రమ సాగులో అడ్డగోలుగా కమీషన్ల దందా

Advertisement
 

తప్పక చదవండి

Advertisement