కలుషితం.. అనారోగ్యం
గోదావరిఖని: రామగుండం నగరంలోని సింగరేణి కార్మిక కుటుంబాలకు సమీప గోదావరి నది నుంచి పంపింగ్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీ తదితర కాలనీల్లో నివాసం ఉండే కార్మిక కుటుంబాలకు రోజూ 35ఎంఎల్‌డీ నీరు అందిస్తున్నారు. ఇందుకోసం నదిలో ఫిల్టర్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఫిల్టర్‌బెడ్ వరకు తరలించి.. భారీ విద్యుత్ మోటార్లతో నేరుగా కార్మికవాడలకు అందిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఈ ప్రక్రియ సాఫీగానే సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నీటి సరఫరాలో సమస్యలు మొదలయ్యాయి. బ్యా క్ వాటర్‌తో నదిలో నీటినిల్వలు భారీగా పెరిగా యి. ఏడాది పొడవునా నదిలో నీటి నిల్వలు ఉండడం, నగరంలోని వివిధ ప్రాంతాల్లోంచి విడుద లయ్యే మురుగునీరు, ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి వెలువ డే రసాయనాలు కలిసిన నీరు నేరుగా గోదావరి న దిలో కలుస్తుండడంతో నది నీరు కలుషితమవుతోంది. ఈనీటిన తాగిన కార్మిక కుటుంబాలు డయేరి యా, మలేరియా, ఇతరత్రా ప్రాణాంతక వ్యాఽ దు లకు గురయ్యారు. వర్షాకాలంలో మురికినీరు రా వడంతో ఎందుకూ పనికిరాకుండాపోయింది.
హైదరాబాద్‌కు ‘భగీరథ’ ద్వారా సరఫరా
● గోదావరిఖని సమీపంలోని గోదావరి నదిలో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్లు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ అధికారులు.. వీటి ద్వారా హైదరాబాద్‌కు తాగునీరు సరఫరా చేస్తున్నారు.
● గోదావరి నదిలోని ఇదే ప్రాంతం నుంచి సమీప సింగరేణి కార్మిక కుటుంబాలకు మాత్రం కలుషిత నీరు సరఫరా అవుతోంది.
● తద్వారా కార్మికులు, వారి కుటుంబసభ్యులు కలుషిత నీరు తాగి అనారోగ్యాల బారినపడుతున్నారు.
● హైదరాబాద్ తరహాలోనే స్థానికులమైన తమకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కొద్ది నెలలుగా డిమాండ్ వస్తోంది.
● సమాచారం అందుకున్న అప్పటి సింగరేణి సీఎండీ శ్రీధర్.. మిషన్ భగీరథ తరహాలోనే ర్యాపిడ్ గ్రావిటీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
● ఇందుకోసం రెండేళ్ల క్రితమే నిధులు మంజూరు చేశారు.
● సాంకేతిక కారణాలతో అవి నిలిచిపోయాయి.
● ఫలితంగా ప్లాంట్ పనులు స్తంభించాయి.
రూ.20కోట్లు కేటాయింపు..
సింగరేణి కార్మిక కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మిక కాలనీలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని పలు కార్మిక సంఘాలు, కాంగ్రెస్ పార్టీ రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి పెంచారు. ఈక్రమంలో ఇటీవల రూ.20కోట్లు మంజూరయ్యా యి. దీంతో ఆర్జీ–1 ఏరియా జీడీకే–1, 3గని ఫ్యాన్‌హౌస్ సమీపంలో 35ఎంఎల్‌డీ సామర్థ్యంతో ర్యాపి డ్ గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఈఏడాది మార్చి 16వ తేదీన సింగరేణి డైరెక్టర్ ఎన్‌వీకే శ్రీనివాస్ ప్లాంట్ పనులకు భూమిపూజ చేశారు. అయితే, రెండు నెలల తర్వాత పనులు ప్రారంభమయ్యాయి.
ప్రతిష్టాత్మకంగా ప్లాంట్ నిర్మాణం..
సింగరేణి యాజమాన్యం అత్యంత ప్రతిష్టాత్మకంగా ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. అయితే, సాంకేతిక కారణాలతో పనుల్లో సుమారు రెండు నెలలు జాప్యం జరిగింది. మ్యాప్‌లు, సాంకేతిక అనుమతుల మంజూరులో పనుల్లో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది.
ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ పనుల్లో జాప్యం
కార్మిక కాలనీలకు అందని స్వచ్ఛమైన తాగునీరు
గడువులోగా పూర్తి చేస్తాం
సాంకేతిక కారణాలతో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ ప్లాంట్ పనుల్లో జాప్యమైంది. అయినా, ప్రస్తుతం ఫౌండేషన్ పనులు ప్రారంభమయ్యాయి. నిర్దేశిత ఏడాదిలోగా ప్లాంట్ ప్రారంచేలా చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్, ఆర్జీ–1 జీఎం
Comments
Please login to add a commentAdd a comment