వెంట తిరిగి.. హ్యాండిచ్చి.. | - | Sakshi
Sakshi News home page

వెంట తిరిగి.. హ్యాండిచ్చి..

Published Thu, May 16 2024 1:05 PM | Last Updated on Thu, May 16 2024 1:05 PM

వెంట తిరిగి.. హ్యాండిచ్చి..

వెంట తిరిగి.. హ్యాండిచ్చి..

● కొంపముంచిన కోవర్టులు! ● అంతర్గత సమావేశాలు, సమీక్షలో తేల్చిన నేతలు ● సైలెంట్‌ ఓటింగ్‌తో టఫ్‌ ఫైట్‌గా మారిన వైనం ● పార్లమెంట్‌ ఎన్నికలపై పోస్ట్‌మార్టం

సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల్లో కో వర్టులు కొంపముంచారనే ప్రచారం ఆయా పార్టీల అభ్యర్థులో గుబులు రేపుతోంది. పోలింగ్‌కు ముందు అభ్యర్థులు వేసుకున్న గెలుపోటముల అంచనాలను సైతం వీరు తారుమారు చేశారనే అభిప్రాయా లూ వ్యక్తమవుతున్నాయి. విజయావకాశాలపై ఎవ రి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా అభ్యర్థులను లోలోపల కోవర్టుల తీరు కలవరపాటు కలిగిస్తోంది. సా ధారణంగా ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి ని ర్వహిస్తే క్రాస్‌ ఓటింగ్‌కు ఆస్కారం ఉంటుంది. ఒక పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థికి ఒక ఓటు వేస్తే.. మ రోపార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థికి ఇంకో ఓటు వే స్తారు. అలాగే కొందరు పార్టీలోనే ఉంటూ కోవర్టు రాజకీయాలతో ప్రత్యర్థి పార్టీలకు ఓటు వేయాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తుంటారు. ఇలాంటి ఘటన లు తరచూ వెలుగు చూస్తుంటాయి. కానీ, ఈసారి పార్లమెంట్‌ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో గతా నికి భిన్నంగా అన్ని పార్టీల్లోని కొందరు(కోవర్టులు) ఒక పార్టీ వైపు మెగ్గుచూపినట్లు పోలింగ్‌ సరిళిపై నిర్వహించిన సమీక్షల్లో తేలడంతో నేతల్లో ఆందోళ న మొదలైంది. పోలింగ్‌ శాతం అధికంగా నమోదైన స్థానాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అనుచరులే..

రాత్రింబవళ్లూ తమవెంటే తిరిగి ప్రచారం చేసిన కొందరు నేతలు, పోలింగ్‌ జరిగిన రోజున పలానా పార్టీకే ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించి హ్యాండ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికితోడు గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం స్వల్పంగా పెరిగింది. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సుమారు 10శాతం పోలింగ్‌ తక్కువ నమోదైంది. దీంతో ఎవరిని విజయం వరిస్తుంది, ఎవరు పరాజయం పాలవువుతారనే దానిపై లెక్క లు కడుతున్నారు. రెండు నెలల పాటు ప్రచారం హోరెత్తితే.. ఫలితం వచ్చేందుకు మిగిలిన 20రోజు ల పాటు ఎదుర్కొనే ఉత్కంఠ ఒక ఎత్తుని అని కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

అంతుచిక్కని లెక్కలు.. ఆందోళనలో నేతలు

రూరల్‌, పట్టణ ఓటర్లు, లబ్ధిదారులు, వృద్ధులు, మ హిళలు, మైనార్టీలు, దళితులు, బీసీలు.. ఇలా వర్గాల వారీగా ఎటువైపు మెగ్గుచూపారని నేతలు లెక్కలు తీస్తున్నారు. క్షేత్రస్థాయిలో నుంచి వస్తున్న ఫీడ్‌ బ్యాక్‌తో అన్నిపార్టీల్లో కోవర్టులు ఉన్నట్లు తే ల్చుతున్నారు. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లిందనే ప్రచారం ఉంది. పెద్దపల్లిలో బీజేపీలోని ఒక వర్గం ఓటు బ్యాంకు కాంగ్రెస్‌ వైపు మళ్లీనట్లు ప్రచారంలో ఉంది. మరోవైపు టీబీజీకేఎస్‌ నేతలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓట్లు వేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు.. డబ్బులు కావాలని ఓటర్ల నుంచి వచ్చిన ఒత్తిడి తట్టుకోలేక పైనుంచి డబ్బులు రాలేదని, ఇష్టం వ చ్చిన పార్టీకి ఓట్లు వేసుకోవానలి కాంగ్రెస్‌లోని ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఇలాగే చెప్పినట్లు తెలుస్తోంది.

సైలెంట్‌ ఓటింగ్‌.. టఫ్‌ ఫైటింగ్‌

ఓటరు నాడీ పట్టేందుకు నేతలు తంటాలు పడుతున్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీల్లో సైలెంట్‌ ఓటింగ్‌ ఎవరికి అనుకూలం? ఎవరికి ప్రతికూలమనేది అంతుచిక్కడం లేదు. ఏ ఇద్దరు కలిసినా మోదీ హవా పనిచేసిందా? బీజేపీ వైపు మొగ్గు చూపారా? అనే చర్చ సాగుతోంది. అభ్యర్థిని కాకుండా మోదీ క్రేజ్‌తో మహిళలు, వృద్ధులు, యువత చేసిన సైలెంట్‌ ఓటింగ్‌ బీజేపీ కలిసొచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంపీ ఎన్నికల్లో కనిపించలేదని చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాల్లో పోటాపోటీగా సొమ్ము పంచడంతోపాటు ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్‌కు కలిసిసోచింది. కానీ, లోక్‌సభ ఎన్నికలు జాతీయ అంశాల ఆధారంగా జరగటంతో ఓటర్లు అటువైపే మొగ్గు చూపారనే విశ్లేషణ తెరపైకి వస్తోంది. ఏదేమైనా క్రాస్‌ఓటింగ్‌ అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనేది అంచనా. అయితే ఇది బీజేపీకి అనుకూలమా, లేక కాంగ్రెస్‌కు అనుకూలమా ?బీఆరఎస్‌కు ప్రయోజనం చేకూర్చుతుందా? అనేది జూన్‌ 4 వరకు వేచిచూస్తేనే తెలుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement