సీజనల్ వ్యాధులపై అప్రమత్తత తప్పనిసరి
పాలకొండ రూరల్: ప్రస్తుత వేసవి చివరలో కురిసే అడపా దడపా వర్షాల కారణంగా గొర్రెల్లో వచ్చిన సీజనల్, సాధారణ వ్యాధులు వాటి నివారణ చర్యలపై పాడిరైతు లు, పెంపకందారులు అవగాహన పెంచుకోవాలని పశు సంవర్థకశాఖ సహాయ సంచాలకుడు (ఎ.డి) ప్రభా మాణిక్యరావు అన్నారు. లేనిపక్షంలో జీవాలు మృత్యువాత పడే అవకాశం ఉందన్నారు. వివిధ రకాల క్రిమి, కీటకాల వల్ల వ్యాధులు సంక్రమిస్తా యని తెలిపారు. గొర్రెల పెంపకందారులు సరైన సమయంలో సమస్యలు గుర్తించి, వైద్యుల సూచన లు పాటించాలన్నారు. ఈ మేరకు సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
సూక్ష్మజీవుల ద్వారా...
సూక్ష్మజీవుల వల్ల చిటుకు వ్యాధి(ఈటీ), అంత్రాక్స్ లేదా నల్లజాడ్యం, ఊపరితిత్తుల్లో నెమ్ము లేదా నెమోనియో, పొగాళ్లు లేదా బురద పుండ్లు, మితు వకాళ్లు, గొంతువాపు వ్యాధుల సంభవిస్తాయి. గాలి కుంటు, నీలి నాలిక, బొబ్బరోగం, అమ్మతల్లి, నోటి పుండ్లు వంటివి వైరస్ ద్వారా ఒకదాని నుంచి ఇంకొకదానికి చేరి మందకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. తేలికపాటి వర్షాలు కురిసేటప్పుడు క్లాస్ట్రీడియం జాతి సూక్ష్మజీవుల వల్ల ఎక్కువ ప్రమాదం చోటు చేసుకుంటుంది. బలిష్టంగా, ఆరోగ్యంగా ఉండే గొర్రెలు ఒక్కసారిగా ఎగిరిపడి కొట్టుకుని మర ణించడం.. కడుపును కాళ్లతో తన్నడం.. కడుపు ఉబ్బడం.. నల్లగా దుర్వాసన వచ్చే పారుడు.. నోటి నుంచి నురగ రావడం.. ఫిట్స్ వంటి లక్షణాల ద్వా రా ఈ రోగాలను గుర్తించవచ్చు. ఈ సమస్యలకు చికిత్స అందించే క్రమంలో వైద్యుల సలహా మేరకు రోగ పరిస్థితిని బట్టి ఆక్సిట్రెట్ సైక్లిన్ మందును 5 నుంచి 10 మిల్లీగ్రాములు ఒక కిలో బరువుకు లెక్కకట్టి గొర్రెలకు అందించాలి. 50 మిల్లీగ్రాముల పొటాషియం పర్మాంగనేట్ 100 ఎం.ఎల్ నీటిలో కలిపి తాగించాలి. రోగనివారణకు అవసరమగు టీకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రభు త్వ పశువైద్య కేంద్రాల్లో ఈ టీకాలను ఉచితంగా అందిస్తారు. మూడు మాసాల వయస్సు నిండిన గొర్రెపిల్లలకు తప్పనిసరిగా నట్టల నివారణ మందు ఇవ్వాలని, మొదటి టీకా ఇచ్చిన 15 రోజుల తర్వాత బూస్టర్‌డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఏటా మే నెల మొదటి వారంలో క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి.
Comments
Please login to add a commentAdd a comment