విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం రామనారాయణంలో వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించా రు. బెంగళూరుకు చెందిన ప్రముఖ రచయితలు శ్రీరామ చక్రధర్, శారద దీప్తి శిక్షణ కార్యక్రమానికి హాజరైన చిన్నారులు, పెద్దలకు వ్యక్తిత్వ వికాస సూత్రాలను వివరించారు. మనిషి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమయ్యే వ్యక్తిత్వం, గుణగణాలను వివరించారు. శిక్షణ శిబిరానికి 200 మంది హాజరు కాగా ఆలయ అర్చకులు చాణక్య, హర్షలు శాంతి మంత్రాలు, ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో ఎన్‌సీఎస్ ట్రస్టీలు నారాయణం శ్రీనివాస్, నీరజవల్లి దంపతులు, చీఫ్ ఆడిటర్ బాలాజీ, ఉమాదేవి దంపతులు, జాహ్నవి, తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌బీకేలో చోరీ
మక్కువ: మండలంలోని కాశీపట్నం పంచాయతీలో గల రైతుభరోసా కేంద్రంలో జరిగిన చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఎస్సై పి.నరసింహమూర్తి బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాశీపట్నం గ్రామంలో ఆర్‌అండ్‌బీ రహదారి సమీపంలోని ఆర్‌బీకేలో విధులు నిర్వహిస్తున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గొట్టాపు సతీష్‌కుమార్ ఈనెల 10వతేదీన విధులు నిర్వహించి, రైతుభరోసాకేంద్రం తలుపులకు తాళాలు వేసి వెళ్లిపోయా రు. మళ్లీ ఈనెల 14వతేదీన ఆర్‌బీకేలో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఆయన తలుపులు తీ సి, చూడగా టీవీ, కంప్యూటర్ మానిటర్, ప్రింటర్‌ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. దీంతో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సతీ ష్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment