ఆధ్యాత్మికం.. | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికం..

Published Sun, May 26 2024 8:00 AM

ఆధ్యా

7 నుంచి శ్రీ సూక్త సహిత శ్రీలక్ష్మి మహాయజ్ఞం

సుభాష్‌నగర్‌ : నగరంలోని శ్రీ లక్ష్మి గణపతి మహా ఆలయంలో శ్రీ సూక్త సహిత శ్రీలక్ష్మి మహాయజ్ఞం జూన్‌ 7, 8, 9వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకులుఅరుణ్‌ కుమార్‌ శర్మ తెలిపారు. శనివారం నగరశివారులోని బోర్గాం(పి)లోగల శ్రీలక్ష్మి గణపతి ఆలయంలో ఆయన మాట్లాడారు. 7న యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, శ్రీ సూక్త పారాయణం, 8న శ్రీ సూక్త పారాయణం తర్పణములు, శ్రీ సూక్త యజ్ఞం, శ్రీ చక్రానికి కుంకుమార్చనలు ఉంటాయన్నారు. 9న శ్రీ సూక్త యజ్ఞం సిద్ధిబుద్ధి గణపతి కల్యాణం, పూర్ణహుతి కార్యక్రమంతో ముగుస్తాయని వివరించారు. మూడు రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుందని, ప్రముఖులతో ప్రవచనాలు, సంగీతం, సాహిత్యం, కవి సమ్మేళనం నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని, ఆదివారం ఉదయం యాగశాలకు భూమిపూజ ఉంటుందని తెలిపారు. ఆలయ ప్రతినిధి అంకం జగదీశ్వర్‌ పాల్గొన్నారు.

శ్రీ సత్యసాయి రజతోత్సవం

ధర్పల్లి : ధర్పల్లి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో రజతోత్సవ శనివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సత్యసాయి పల్లకీ సేవా చేపట్టారు. అనంతరం ప్రవచనాలను బోధించారు. బాలవికాస్‌ చిన్నారులచే సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. సిద్దిపేట జిల్లా సేవాదళ్‌ కోఆర్డినేటర్‌ యమునారాణి, జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు ఎన్‌ శ్రీనివాస్‌, చిలక శంకర్‌, గంగాధర్‌, బుచ్చన్న, శోభ, వినిత, జ్యోతి, నవనీత, లక్ష్మి, రాజమణి పాల్గొన్నారు.

ఆధ్యాత్మికం..
1/1

ఆధ్యాత్మికం..

Advertisement
 
Advertisement
 
Advertisement