విద్యను వ్యాపారంగా మార్చడం తగదు | Sakshi
Sakshi News home page

విద్యను వ్యాపారంగా మార్చడం తగదు

Published Sun, May 26 2024 7:55 AM

-

నిజామాబాద్‌ అర్బన్‌ : కార్పొరేట్‌ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చడం తగదని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని నాందేవ్‌వాడాలో గల మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌ భవనంలో ‘ఫీజుల నియంత్రణ– ఆవశ్యకత’ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు మహేశ్‌ అధ్యక్షత వహించగా రిటైర్డ్‌ హెడ్మాస్టర్‌ నర్రా రామారావు మాట్లాడారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు రూ.లక్షల కొద్దీ ఫీజులు వసూలు చేయడం బాధాకరమన్నారు. ప్రతి పాఠశాలలో పేద వర్గాల విద్యార్థులకు 25 శాతం రాయితీ ఇవ్వాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్‌ మాట్లాడుతూ ప్రైవేట్‌ బడుల్లో ఫీజుల వివరాలు ప్రదర్శించాలని డిస్ట్రిక్ట్‌ ఫీ రెగ్యులేటింగ్‌ అథారిటీ చెప్పినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్నారు. కార్క గణేశ్‌, అంజలి, రఘురాం, జన్నారపు రాజేశ్వర్‌, రామ్మోహన్‌రావు, రమేశ్‌బాబు, సుజాత, నరేశ్‌, దీపిక పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement