లోన గుబులు | - | Sakshi
Sakshi News home page

లోన గుబులు

Published Thu, May 16 2024 1:20 PM | Last Updated on Thu, May 16 2024 1:20 PM

లోన గ

లోన గుబులు

నిజామాబాద్‌
పైకి ధీమా..

అప్‌గ్రేడ్‌ చేసినా..

మినీ అంగన్‌వాడీ టీచర్లను మెయిన్‌ అంగన్‌వ ాడీ టీచర్లుగా అప్‌గ్రేడ్‌ చేసినా పాత వేతనమే జమ చేశారు.

గురువారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2024

– 8లో u

మెప్మా ఆర్పీ రాజీనామా

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌కు చెందిన మెప్మా ఆర్పీ గంగామణి తన ఉద్యోగానికి రాజీనా మా చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌ ఎన్ని కల్లో భాగంగా ఈనెల 13న పట్టణంలోని బాలుర పాఠశాలలోని బూత్‌ నంబర్‌ 54లో విధులు నిర్వహించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి వచ్చి తన పై ఆగ్ర హం వ్యక్తం చేశారని, కించపరిచేలా మాట్లా డారని.. అందుకే ఆర్పీ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆర్మూర్‌ మున్సిపల్‌ కా ర్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాజుకు రాజీనామా లేఖను అందజేశారు. అందరి ముందు తనతో దురుసుగా ప్రవర్తించి బయటకు పంపడంతో అవమానకరంగా భావించి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

ఆలయ మాన్యాలను పరిరక్షించాలి

నిజామాబాద్‌ రూరల్‌: ఆలయ మాన్యాలను పరిరక్షించాలని జిల్లా ఎండోమెంట్‌ సహాయ కమిషనర్‌ సుప్రియ అన్నారు. భూములను జీపీఎస్‌ ద్వారా ఫొటోలు తీయించి వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని ఆలయ అర్చకులకు సూచించారు. మండలంలోని మాధవనగర్‌ సాయిబాబా ఆలయంలో బుధవారం కోటగిరి, వర్ని, రుద్రూర్‌, ఇందల్వాయి, మాక్లూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, బోధన్‌, నందిపేట్‌, మోస్రా, నందిపేట్‌ మండలలోని గ్రామాలకు చెందిన పూజారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధూపదీప నైవేద్య పథకం ద్వారా ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆలయాల పేరిట బ్యాంక్‌ ఖాతాలు తీయాలన్నారు. సెక్షన్‌ 43 ప్రకారం ఆయా ఆలయాలను రిజిస్టేషన్‌, పబ్లికేషన్‌ చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సాయిబాబా ఆలయ ఈవో శ్రీరాం రవీందర్‌, అధికారులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయురాలికి షోకాజ్‌ నోటీస్‌ జారీ

కామారెడ్డి టౌన్‌: విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విదేశాలకు వెళ్లిన బీబీపేట మండలం శివరాంరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీరంగం సుహాసినికి తుది షోకాజ్‌ నోటీస్‌ జారీ అయ్యింది. ఈ విషయాన్ని డీఈవో రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరంగం సుహాసిన 2021 అక్టోబర్‌ నుంచి 2023 జూలై వరకే అనుమతి తీసుకున్నారని పేర్కొన్నారు. జూలైనుంచి విధులలో చేరా ల్సి ఉన్నా.. ఇప్పటివరకు చేరకపోవడంతో చట్టపరమైన చర్యల కోసం తుది షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసినట్లు తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీల అభ్యర్థులు పైకి ధీమాగా ఉన్నా.. లోలోపల ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో పోలింగ్‌ శాతం పెరగడంతో పాటు మహిళలు ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో ఈ ఓటింగ్‌ ఎవరికి లాభిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా మూడు పార్టీల మధ్య ఓట్ల చీలిక ఎవరిని గెలిపిస్తుందోననే టెన్షన్‌ అభ్యర్థుల్లో నెలకొంది.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ పూర్తి కాగా, ఫలితాల కోసం మూడు వారాల పాటు ఎదురు చూడాల్సిన నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి భారీగా పోలింగ్‌ నమోదు కావడంతో పాటు అన్ని సెగ్మెంట్లలోనూ మహిళల ఓట్లు అత్యధికంగా పోల్‌ అయ్యాయి. యువ ఓటర్లు భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సోషల్‌ మీడియా ప్రభావంతో అత్యధిక ఇళ్లలో ఓటర్ల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి.

ఈ క్రమంలో ఓకే కుటుంబంలోని భార్యాభర్తలు, వారి పిల్లలు, వృద్ధులు ఓటు వేసే విషయంలో సొంత అభిప్రాయాన్ని కలిగి వేరువేరు పార్టీలకు ఓట్లు వేసిన వారు భారీగానే ఉన్నారు. దీంతో ఓటర్ల నాడి అంతుచిక్కని విధంగా తయారైంది. అదేవిధంగా మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నువ్వా నేనా అనేవిధంగా బరిలో ఉండి పోరాటం చేశారు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓట్లు చీలిపోయాయని వివిధ వర్గాల్లో భారీగా చర్చ జరుగుతోంది. ఈ ఓట్లు తమకే పడ్డాయని రెండు జాతీయ పార్టీలకు చెందిన శ్రేణులు ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. లోలోన మాత్రం గుబులు చెందుతున్నారు. పోలింగ్‌ పూర్తయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఓట్ల లెక్కలు వేసుకుంటూ కూడికలు, తీసివేతల్లో తలమునకలవుతున్నారు. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎన్ని ఓట్లు వస్తాయోనని విశ్లేషణలు చేసుకుంటున్నారు.

ఓట్ల లెక్కలు తిరగేసుకుంటూ టెన్షన్‌ పడుతున్నారు. దీంతో ఆయా పార్టీల శ్రేణుల్లో ధీమాతో పాటు ఎంత గుబులు నెలకొని ఉందో చెప్పకనే తెలుస్తోంది.

● శాసనసభ ఎన్నికల మాదిరిగా లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ భారీగా నమోదైంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధి వ్యాప్తంగా 71.92 శాతం పోలింగ్‌ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే 3.55 శాతం ఎక్కువగా పోలింగ్‌ అయ్యింది. ఇందులో మహిళల ఓట్లు భారీగా పడ్డాయి. పురుషులతో పోలిస్తే 1,21,159 ఓట్లు అత్యధికంగా పోలయ్యాయి. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలోని అన్ని శాసనసభ సెగ్మెంట్లలోనూ మహిళల ఓట్లే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. పూర్తి గ్రామీణ నియోజకవర్గమైన నిజామాబాద్‌ రూరల్‌ సెగ్మెంట్‌లో పురుషుల ఓట్లు 82,547 నమోదు కాగా, మహిళల ఓట్లు ఏకంగా 1,08,702 నమోదయ్యాయి. పట్టణాల్లోనూ ఇదే ట్రెండ్‌ నడిచింది. గ్రామీణ ఓటర్లు ఏవిధంగా తీర్పునివ్వనున్నారో, పట్టణ ఓటర్లు ఏవిధంగా ఓట్లేసారో అనే విషయంలో పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి.

● అయోధ్య రామాలయం నిర్మాణంతో మహిళలు తమవైపు మొగ్గు చూపారని బీజేపీ, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకంతో మహిళలు తమకు ప్రధాన్యమిచ్చారని కాంగ్రెస్‌ చెబుతోంది. ఆరు గ్యారంటీలు అమలు చేస్తుండడంతో తమకు ఓటర్లు పట్టం కడతారని ఆ పార్టీ చెబుతోంది. మోదీ చరిష్మా తమను విజయం వైపు తీసుకెళుతోందని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇక నిజాం షుగర్స్‌, పసుపు బోర్డు అంశాలపై రైతులు ఏవిధంగా స్పందించారనే విషయమై ఒక స్పష్టత లేదు. గల్ఫ్‌, బీడీ కార్మికులు ఎటు మొగ్గు చూపారో నాడి దొరకని పరిస్థితి. ఈ క్రమంలో రెండు జాతీయ పార్టీలు ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోన గుబులు నెలకొంది.

వారం రోజుల్లో రూ. వెయ్యి పెరుగుదల

గుజరాత్‌, పూణె మార్కెట్‌లో

కొరతే ప్రధాన కారణం

న్యూస్‌రీల్‌

పోలింగ్‌ ముగిసింది.. టెన్షన్‌ మిగిలింది

ఫలితాల కోసం మూడు వారాలు

ఎదురు చూడాల్సిందే..

ఓట్ల లెక్కలు తిరగేస్తున్న ప్రధాన పార్టీలు

మహిళలు ఎటువైపు మొగ్గు

చూపారోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ

ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుందోనంటూ విశ్లేషణలు

No comments yet. Be the first to comment!
Add a comment
లోన గుబులు1
1/2

లోన గుబులు

లోన గుబులు2
2/2

లోన గుబులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement