Sakshi News home page

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ ఆస్తులు

Published Sat, Apr 20 2024 1:15 AM

- - Sakshi

సుభాష్‌నగర్‌: బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా రూరల్‌ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్‌లో తనతో పాటు కుటుంబ సభ్యుల స్థిర, చర ఆస్తుల వివరాలను వెల్లడించారు.

● బాజిరెడ్డి గోవర్ధన్‌ వద్ద ప్రస్తుతం రూ.2 లక్షల నగదు, ఆయన భార్య వినోద వద్ద రూ.2 లక్షల నగదు ఉంది.

● బాజిరెడ్డి గోవర్ధన్‌ పేరిట రూ.కోటి 96 వేల చరాస్తులు, స్థిరాస్తులు రూ.2.80 కోట్లు ఉన్నాయి. భార్య పేరుపై రూ.13.41 లక్షల చరాస్తులు, రూ.35.50 లక్షల స్థిరాస్తులు ఉన్నాయి.

● బాజిరెడ్డి పేరుపై ఎలాంటి అప్పులు, బ్యాంకు రుణాలు లేవు.

● బాజిరెడ్డి గోవర్ధన్‌తోపాటు ఆయన భార్య పేరుతో హైదరాబాద్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌లో ఓపెన్‌ ప్లాట్లు ఉన్నాయి. నిజా మాబాద్‌ జిల్లాలో వ్యవసాయ, నాన్‌ అగ్రికల్చర్‌ భూములు ఉన్నా యి. నిజామాబాద్‌, చీమన్‌పల్లిలో రెండు సొంత ఇండ్లు ఉన్నాయి.

● బాజిరెడ్డి గోవర్ధన్‌కు 50 తులాలు, ఆయన భార్యకు మరో 50 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి.

● బాజిరెడ్డికి రూ.30 లక్షల విలువ చేసే జీపు ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement