26న సామూహిక సత్యనారాయణ వ్రతాలు | Sakshi
Sakshi News home page

26న సామూహిక సత్యనారాయణ వ్రతాలు

Published Thu, Nov 16 2023 1:12 AM

- - Sakshi

26న సామూహిక సత్యనారాయణ వ్రతాలు

డిచ్‌పల్లి: మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో గల శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో ఈనెల 26న సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించనుస్తున్నట్లు ఆలయ అర్చకుడు రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల భక్తులు ఈ నెల 22వ తేదీ లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. సత్యనారాయణ వ్రతానికి వచ్చే వారితో పాటు వాళ్ళ బంధువులకు కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్తీక పౌర్ణమి ఆదివారం సాయంత్రం స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు.

వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

మోపాల్‌: మోపాల్‌తోపాటు జిల్లా కేంద్రంలోని వృద్ధులు, యాచకులకు 170 దుప్పట్లు బుధవారం మండలకేంద్రానికి చెందిన పెద్దోళ్ల అశ్విత వినోద్‌రెడ్డి పంపిణీ చేశారు. చలికాలం దృష్ట్యా పేదలకు తనవంతు సాయంగా దుప్పట్లు పంపిణీ చేశామని వారు తెలిపారు. ప్రతిఒక్కరూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అంగలి నవీన్‌రెడ్డి, ద్యాప రవికుమార్‌, సాగర్‌, వంశీరెడ్డి, సాయికిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

అలరించిన ఫ్రెషర్స్‌ పార్టీ

ఖలీల్‌వాడి: నగరంలోని ఎస్‌వీ డిగ్రీ కళాశాలలో బుధవారం విద్యార్థులు ఫ్రెషర్స్‌ పార్టీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్‌ అంబోజి హరిప్రసాద్‌ హాజరై, మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కళాశాల ఉత్తమ విద్యార్థిని నవిత గోల్డ్‌మెడల్‌ సాధించడంతో సన్మానం చేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీనివాస్‌, సాధిక్‌, రమేష్‌, రాజేశ్వర్‌, బార్గవి, శ్రీలత, పద్మ, శీరిష, సంధ్య, దివ్య, స్వప్న, మౌనిక తదితరులు ఉన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

ఖలీల్‌వాడి: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఖోఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఖోఖో పోటీల్లో కంజర గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ నవీన్‌ బుధవారం తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ఈనెల 15న తూఫ్రాన్‌లో నిర్వహించబోయే పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆలాగే రాష్ట్రస్థా యి కల్చరల్‌ పోటీలకు భానువర్షిత్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆర్‌సీవో సత్యనాథ్‌రెడ్డి, డిప్యూటీ వార్డెన్‌, సిబ్బంది విద్యార్థులను అభినందించారు.

నేడు రూరల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రచారం

ధర్పల్లి: మండలంలోని వివిధ గ్రామాల్లో గురువా రం నిజామాబాద్‌ రూరల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి భూపతిరెడ్డి ప్రచారం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఆర్మూర్‌ బాలరాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని రామడుగు, కేసారం, మైలారం, రేకులపల్లి, దుబ్బాక, డీబీతండా, గుడి తండా, మరియాతండా, గోవింద్‌పల్లిలో ఆయన ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన తెలిపారు.

పేకాట స్థావరాలపై దాడి

నిజామాబాద్‌రూరల్‌: రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాలు, కాలనీలలో దీపావళి సందర్భంగా పేకాట ఆడుతున్న స్థావరాలపై గత మూడురో జులుగా దాడులు జరిపి 7 కేసులు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్‌, సిబ్బంది బుధవారం తెలి పారు. మొత్తం 7 కేసులలో 25మంది పట్టుకొని వా రి నుంచి రూ.83,180 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడ్డవారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

గురుకుల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి

డిచ్‌పల్లి: పిల్లలకు కుళ్లిన కూరగాయలతో భోజనం పెడుతున్న సుద్దపల్లి గురుకుల బాలికల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు బుధవారం సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్మారం(బి) గ్రామంలోని రీజనల్‌ కోఆర్డినేటర్‌ (ఆర్‌సీవో) కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, ఆర్‌సీవోకు వినతిపత్రం అందజేశారు. రాజేశ్వర్‌ మాట్లాడుతూ.. అధికారులు విచారణ జరిపి ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. నాయకులు శివసాయి, రవీందర్‌, అక్షయ్‌, ఆకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్తం

1/2

2/2

Advertisement
Advertisement