No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, May 26 2024 2:45 AM

No Headline

నిర్మల్‌టౌన్‌: కేసుల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక సూచించారు. కేసుల సత్వర పరిష్కారంపై జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీసు ఉన్నతాధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. జిల్లాలో నేరాల అదుపునకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కేసులు పరిష్కారంకాని సందర్భంలో లోక్‌ఆదాలత్‌ ద్వారా పరిష్కరించేలా చూడాలన్నారు. చట్టాల ఆవశ్యకతను వివరించాలన్నారు. జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జూన్‌ 8న జాతీయ లోక్‌ ఆదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ కోర్టుల్లో రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఇందులో క్రిమినల్‌, సివిల్‌, భూతగాదాలు, రోడ్డు ప్రమాదాలు, భార్యభర్తల గొడవలు, కుటుంబ తగాదాలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని వివరించారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌, నిర్మల్‌ డీఎస్సీ గంగారెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement