గృహజ్యోతి డౌన్‌ | Sakshi
Sakshi News home page

గృహజ్యోతి డౌన్‌

Published Wed, May 15 2024 8:45 AM

గృహజ్

● పెరుగుతున్న విద్యుత్‌ వినియోగం ● తగ్గుతున్న లబ్ధిదారులు

జీరో బిల్లు రాలే

మాకు తెల్ల రేషన్‌కార్డు ఉంది. జీరో బిల్లు కోసం ప్రజాపాలన గ్రామ సభలో దరఖాస్తు చేసుకున్నం. కానీ మాకు జీవో బిల్లు రావడం లేదు. నెలనెలా కరెంటు బిల్లు కడుతున్నం. జీరో బిల్లు వచ్చేలా చూడాలి.

– ఆకుల లక్ష్మి, ధర్మోర

ఎన్నికల తర్వాత

కొత్తవారికి..

ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది అవసరమైన ధ్రువపత్రాలు సమర్చించ లేదు. వారంతా మార్చిలో మళ్లీ దరఖాస్తును చేసుకున్నారు. అర్హత ఉన్నవారికి ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత జీవో బిల్లుల జారీ చేస్తాం.

– శివకుమార్‌, విద్యుత్‌ ఏఈ

నిర్మల్‌చైన్‌గేట్‌/లోకేశ్వరం: గృహజ్యోతి వినియోగదారుల సంఖ్య తగ్గుతోంది. ఎండలు తీవ్రంగా పెరగడంతో విద్యుత్‌ వినియోగం పెరిగింది. దీంతో మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో 200 యూనిట్ల కంటే అధికంగా 37,190 మంది విద్యుత్‌ వినియోగించారు. దీంతో వారంతా ఈ పథకానికి అర్హత కోల్పోయారు.

తగ్గిన లబ్ధిదారులు..

జిల్లాలో 1,96,128 విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉండి గృహజ్యోతి కింద లబ్ధి పొందే వారు 99,126 మంది ఉన్నట్లుగా విద్యుత్‌ శాఖ అధికారులు గుర్తించారు. తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగించే వారికి ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ వెంటనే దాన్ని అమలు చేస్తూ అర్హులైన వారికి జీరో బిల్లులు జారీ చేశారు. కొంత మంది కనెక్షన్ల వివరాలు తప్పుగా రాయడం, ఆధార్‌ వివరాలు జత చేయకపోవడం వంటి కారణాలతో లబ్ధి పొందడం లేదు. తాజాగా పెరిగిన ఎండలతో గతంలో జీరో బిల్లులు పొందిన లబ్ధిదారులు సర్కారు రా యితీకి దూరమవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు 200 యూనిట్లు వినియోగించే వా రికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పరిమితి దాటితే మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. పెరి గిన విద్యుత్‌ వినియోగంతో ఈ లబ్దిదారుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన మూడు నెలల్లో 40,604 మంది తగ్గిపోయారు. ఏప్రిల్‌లో 3,795 మంది తగ్గిపోగా మేలో 8వ తేదీ వరకు 56,365 మందికి జీరో బిల్లులు జారీ చేశారు. ఇంకా బిల్లులు జారీ చేయాల్సి ఉన్నందువల్ల ఎంతమంది తగ్గుతారనేది వెల్లడి కాలేదు. జీరో బిల్లులు రాని వారంతా బిల్లులు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

రెట్టింపైన వాడకం...

జిల్లాలో మార్చితో పోల్చితే ఏప్రిల్‌, మే నెలల్లో విద్యుత్‌ వినియోగం పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 45 డిగ్రీలకు చేరువయ్యాయి. వడ గాలులు సైతం వీస్తున్నాయి. ఉదయం 10 దాటితే జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు.

నెల లబ్ధిదారులు పంపిణీ అయిన బిల్లులు వచ్చిన బిల్లు(రూ.ల్లో)

మార్చి 99,126 96,969 260.20 లక్షలు

ఏప్రిల్‌ 99,041 93,174 334.50 లక్షలు

మే 61,851 56,365 219.41 లక్షలు

గృహజ్యోతి డౌన్‌
1/2

గృహజ్యోతి డౌన్‌

గృహజ్యోతి డౌన్‌
2/2

గృహజ్యోతి డౌన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement