Sakshi News home page

ఆధారాలతో ఫిర్యాదు చేసినా చర్యలు లేవు

Published Fri, Mar 29 2024 1:00 AM

మాట్లాడుతున్న మహేశ్వర్‌రెడ్డి
 - Sakshi

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని ఆధారాలతోసహా కలెక్టర్‌ కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని బీజేఎల్పీ నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మహేశ్వర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మల్‌లో మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేసిన అవినీతి అక్రమాలను అధికార కాంగ్రెస్‌ పార్టీ కాపాడుతోందని ఆరోపించారు. సోఫీనగర్‌లోని ప్రభుత్వ భూమిలో కట్టిన డీమార్ట్‌ విషయంలో అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రెవెన్యూశాఖ మంత్రి ఆదేశాలు ఇచ్చినా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. డీమార్టు నిర్మించిన స్థలం ప్రభుత్వానిదని అధికారులు సర్టిఫై చేసి ఇప్పుడు కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి సహకరిస్తున్నారన పేర్కొన్నారు. తాత్కాలికంగా డీమార్ట్‌ను ఓపెన్‌ చేయించినా స్థలం స్వాధీనం చేసుకునేలా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. సోఫీనగర్‌తోపాటు గాజులపేట, వెంకటాపూర్‌, అయ్యప్ప టెంపుల్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ, దేవాదాయ భూముల విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోతే, బీజేపీ నేతలంతా కాషాయ జెండాలు ధరించి గాజులపేటలోని శ్రీకృష్ణ దేవాలయం భూములు కాపాడుకునేందుకు ఆందోళనకు దిగుతామన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement