తప్పతాగి వధువుకి బదులు కాబోయే అత్త మెడలో..

Viral Video Drunk Groom Tries to Put Varmala on Mother In Law Neck - Sakshi

ఫుల్లుగా తాగి మంటపంలో పడిపోయిన పెళ్లి కొడుకు

వీడియో వైరల్‌.. ట్రోల్‌ చేస్తున్న నెటిజనులు

పెళ్లిలో వరుడు చేసిన బిత్తిరి పనికి వచ్చిన అతిథులంతా షాకయ్యారు. అతగాడి అవతారం చూసి.. పెళ్లినాడే ఇలా ఉంటే.. ఇక జీవితాంతం ఎలా ఉంటాడు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ వరుడు చేసిన ఘనకార్యానికి సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఇంతకు అతగాడు వెలగబెట్టిన ఆ ఘనకార్యం ఏంటో  తెలియాలంటే ఇది చదవాల్సిందే. 

నిరంజన్‌ మహామాత్ర అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో పెళ్లి జరుగుతుంటుంది. ఇక వరుడు తప్పతాగి మంటపానికి చేరుకుంటాడు. ఫుల్లుగా తాగి ఉండటంతో వరమాల మార్చుకునే సమయంలో.. వధువుకి బదులు ఆమె తల్లి.. అంటే కాబోయే అత్త మెడలో దండ వేయబోతాడు. పక్కనున్న వారు ప్రమాదాన్ని గ్రహించి పెళ్లికొడుకుని పక్కకు జరపుతారు.

ఆ తర్వాత వరుడి స్నేహితులు అతడిని పట్టుకుని.. వధువు మెడలో వరమాల వేయించే ప్రయత్నం చేస్తారు. కానీ ఫుల్లుగా తాగి ఉండటంతో వధువు మెడలో వరమాల వేయకుండానే స్టేజీ మీదే పడిపోతాడు. పెళ్లికి వచ్చిన వారంతా వరుడి బిత్తరి చర్యకు షాక్‌ అయ్యారు. ఈ సంఘటన  ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే దాని గురించి ఎలాంటి వివరాలు లేవు. ఇక పాతదే అయినా ఇప్పుడు ఈ వీడియో చూసిన వారంతా ‘‘వీడికిందే పోయే కాలం.. పెళ్లి నాడు కూడా తప్పతాగి వచ్చాడు’’ అంటూ విమర్శిస్తున్నారు. 

చదవండి: పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్​.. వైరల్​ వీడియో

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top