Delhi: యమునపై విషపు నురగ.. పడిపోయిన గాలి నాణ్యత! | Toxic Foam Returns To Yamuna Delhi | Sakshi
Sakshi News home page

Delhi: యమునపై విషపు నురగ.. పడిపోయిన గాలి నాణ్యత!

Oct 25 2026 11:19 AM | Updated on Oct 25 2026 11:45 AM

Toxic Foam Returns To Yamuna Delhi

న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. కాళింది కుంజ్ సమీపంలో యమునా నది నీటిపై దట్టమైన రసాయన తెల్లటి నురగ మళ్లీ కప్పేసింది. అదే సమయంలో ఈ ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 168కి పడిపోయి ‘అనారోగ్యకరమైన’ స్థాయికి చేరింది.

గాలిలో పీఎం2.5, పీఎం10 కాలుష్య కారకాలు ఎక్కువగా ఉన్నట్లు పర్యవేక్షణ కేంద్రాలు వెల్లడించాయి. నదిని ప్రక్షాళన చేయడానికి రూ.9,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించినట్లు ఇటీవల ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో సమస్య అలాగే కొనసాగుతుండటానికి ఈ దృశ్యాలు నిదర్శనంగా నిలిచాయి. కాలుష్యాన్ని నియంత్రించేందుకు కాలుష్య నియంత్రణ కమిషన్ (సీఏక్యూఎం) అక్టోబర్ 21 నుంచే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ‘గ్రాప్‌’ మొదటి విడతను అమలు చేసింది. దీని ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లలో బొగ్గు, కట్టెల వాడకంపై నిషేధం విధించడంతో పాటు డీజిల్ జనరేటర్ల వినియోగంపై ఆంక్షలు విధించారు. 

ఇదీ చదవండి: నవంబర్‌ 7 వరకు సౌదీకి విమానాలు రద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement