ఆఫీసులోనే హవ్వ.. ప్రజాప్రతినిధి, ఉద్యోగిని సరసాలు   | Karnataka: Gram Panchayat Member Kissed To PDO in Panchayat Office | Sakshi
Sakshi News home page

ఆఫీసులోనే హవ్వ.. ప్రజాప్రతినిధి, ఉద్యోగిని సరసాలు  

Jul 4 2022 1:46 PM | Updated on Jul 4 2022 2:23 PM

Karnataka: Gram Panchayat Member Kissed To PDO in Panchayat Office - Sakshi

సాక్షి, బెంగళూరు: మంచి నడవడికతో సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి, ప్రభుత్వ ఉద్యోగిని దారి తప్పారు. ఆఫీసులోనే సరసాలకు దిగిన వైనాన్ని సీసీ కెమెరాలు బట్టబయలు చేశాయి. వారి ప్రేమపురాణం చూసి అందరూ హవ్వ అని నివ్వెరపోయారు. వివరాలు.. తుమకూరు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి అయిన మాదుస్వామి స్వగ్రామమైన చిక్కనాయకనహళ్ళి తాలూకాలోని జేసిపుర గ్రామ పంచాయతీ ఆఫీసులో ఈ తతంగం జరిగింది.

మహిళా ఉద్యోగినితో గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌ ప్రేమాయణం నెరుపుతున్నాడు. ఆఫీసులో ఇతరులు లేని సమయంలో ముద్దుమురిపాలకు దిగారు. అయితే అక్కడే సీసీ కెమెరాలున్నసంగతిని వారు మరిచిపోయారు. ఎవరో సీసీ ఫుటేజీలను చూసి లీక్‌ చేయడంతో అంతటా వ్యాప్తి చెందాయి. ఫుటేజీపై ఉన్న తేదీలను బట్టి మే 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఇది జరిగినట్లు తెలుస్తోంది.

   

Advertisement
 
Advertisement
Advertisement