Fancy Registration Numbers Fetch Bumper Earning For RTO - Sakshi
Sakshi News home page

Fancy Vehicle Numbers: వామ్మో, ఫాన్సీ నెంబర్లపై ఇంత మోజా!  0001 ధరెంతో తెలుసా?

Jul 23 2021 3:58 PM | Updated on Jul 23 2021 8:27 PM

Fancy registration numbers fetch bumper earning for RTO - Sakshi

ఇండోర్‌: ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లపై ఉన్న క్రేజ్‌ మామూలుదికాదు. తమ ముచ్చటైన వాహనానికి లక్కీ నెంబర్‌ దక్కించుకునేందుకు వాహనదారులు ఎంత సొమ్మైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు. వీఐపీ నంబర్లంటే అంత మోజు! అందుకే వీటిని ఈ-వేలంలో అత్యధిక ధరకు సొంతం చేసుకుంటూ ఉంటారు. ఈ వ్యామోహమే రవాణా కార్యాలయాలకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. తాజాగా ఇండోర్‌ ఆర్‌టీఓ కార్యాలయం కూడా వీఐపీ నంబర్ల విక్రయం ద్వారా బంపర్‌ ఆదాయన్ని సాధించింది. 

‘0001’ రిజిస్ట్రేషన్ నంబర్ 5 లక్షల 21 వేల అమ్ముడుబోయింది. అలాగే  0009 నంబర్  లక్షా 82 వేలకు విక్రయించింది.  ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ప్రజలు తమ ఆసక్తి కనబర్చడం ఇదే మొదటిసారి కాదు. ఆ స్పెషల్‌ నంబర్లు గతంలో కూడా  రికార్డు ధరకు అమ్ముడు  బోయాయి. ఉదాహరణకు, 2017 లో  "0001" నంబరు ఢిల్లీలో రూ .16 లక్షలకు వేలం వేయగా, ఈ సిరీస్ 2014 లో రూ .12. 50 లక్షలకు, 2015 ఏడాదిలో  రూ.12.05 లక్షలకు విక్రయించబడింది. పుట్టినరోజు, ఇతర ముఖ్యమైన రోజులతోపాటు,  ఇంకా వారి వారి జాతకం ఆధారంగా కొందరు కొన్ని లక్కీ నెంబర్లను ఎంచుకుంటారు. 

Advertisement
 
Advertisement
Advertisement