సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు | CJI Surya Kant addresses NLSIU convocation | Sakshi
Sakshi News home page

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Oct 17 2026 5:27 PM | Updated on Oct 17 2026 6:04 PM

CJI Surya Kant addresses NLSIU convocation

సాక్షి,బెంగ‌ళూరు: నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ) 34వ స్నాతకోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన ఈ స్నాతకోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ పవిత్రతను దెబ్బతీసేందుకు, విద్యార్థుల భవిష్యత్తుపై నీళ్లు చల్లేందుకు బయటి శక్తులు తెరవెనుక ప్రయత్నాలు చేశాయని మండిపడ్డారు. ఎంతమంది అడ్డుకోవాలని చూసినా, చివరకు చెడుపై మంచి గెలుస్తుందని, నిజాయితీపరులదే అంతిమ విజయమని వ్యాఖ్యానించారు.

కొత్తగా పట్టాలు అందుకుంటున్న యువ న్యాయవాదులు కేవలం చట్టాలను చదవడమే కాకుండా, విభిన్న అభిప్రాయాలను గౌరవించే తత్త్వాన్ని, మేధో స్వతంత్రతను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అవతలి వారి వాదన వినకుండా తొందరపడి ఎలాంటి నిర్ణయాలకు రావద్దని హితవు పలికారు.

 ఈ ఏడాది ఆగస్టులో జరగాల్సిన ఎన్ఎల్ఎస్ఐయూ స్నాతకోత్సవ వేడుకల నిర్వహణపై తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మానన్ కుమార్ మిశ్రాను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, పూర్వ విద్యార్థులు కలిసి ఓపెన్ లెటర్ విడుదల చేశారు.

గతంలో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు తమ క్యాంపస్‌ను సందర్శించనున్న సీజేఐ పర్యటనను వ్యతిరేకించారు. దీనిపై స్పందించిన బీసీఐ, నల్సార్‌కు చెందిన 2026 గ్రాడ్యుయేటింగ్ విద్యార్థులు ఎలాంటి న్యాయవాద వృత్తి నమోదు (ఎన్‌రోల్‌మెంట్) చేసుకోకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ఉత్తర్వులను బీసీఐ వెనక్కి తీసుకుంది.

విద్యార్థుల భావప్రకటన స్వేచ్ఛను అణచివేసేలా బీసీఐ వ్యవహరించిన తీరును, దానికి నాయకత్వం వహించిన బీసీఐ చైర్మన్‌ను ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ విద్యార్థులు తప్పుబట్టారు. అలాంటి వ్యక్తులను యూనివర్సిటీ స్నాత కోత్సవానికి ఆహ్వానించి విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయడం తమను అవమానించడమేనని వాదించారు.

చివరకు విజయవంతంగా వేడుక 
విద్యార్థుల నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత, నిరసనల కారణంగా ఆగస్టు చివరి వారంలో జరగాల్సిన ఈ స్నాతకోత్సవం అప్పట్లో రద్దయింది. విద్యార్థులకు డిగ్రీలను నేరుగా హాజరుకాకుండా అందజేస్తామని యూనివర్సిటీ తెలిపింది. అయితే అన్ని అడ్డంకులను దాటుకుని తాజాగా ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించారు.

ఇదీ చ‌ద‌వండి : నల్సార్‌ గ్రాడ్యుయేట్ల ఎన్‌రోల్‌మెంట్‌ నిలిపేయం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement