గూగుల్‌ మ్యాప్‌తో పోలీసులు కాస్త దొంగలయ్యారు! | Assam police misled by Google maps Then Happend This | Sakshi
Sakshi News home page

గూగుల్‌ మ్యాప్‌తో పోలీసులు కాస్త దొంగలయ్యారు!, ఆపై..

Jan 9 2025 2:10 PM | Updated on Jan 9 2025 3:30 PM

Assam police misled by Google maps Then Happend This

గూగుల్‌ మ్యాప్‌ మరోసారి హ్యాండిచ్చిన ఘటన ఇది. ఓ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్నారు. అయితే అది కాస్త దారుణ పరాభవానికి దారి తీసింది. పోలీసులను దొంగలుగా భావించి చితకబాదిన జనం.. రాత్రంతా కట్టేసి బందీలుగా ఉంచుకున్నారు. చివరకు అసలు విషయం తెలిసి సారీ చెప్పి వదిలేశారు. 

అసోంలోని జోరాత్ జిల్లాకు చెందిన 16 మందితో కూడిన పోలీసు బృందం నిందితుడిని పట్టుకునేందుకు బయలుదేరింది. ఈ క్రమంలో ఈ బృందం గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంది. మ్యాప్ అసోంలోని ఓ తేయాకు తోటను చూపించింది. నిజానికి అది నాగాలాండ్‌లోని నాగాలాండ్‌లోని మోకోక్‌చుంగ్ జిల్లా ప్రాంతం. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం లోపలికి వెళ్లారు. అయితే..  

వారి వద్దనున్న అధునాతన ఆయుధాలు చూసిన స్థానికులు వారిని దుండగులుగా పొరబడి చుట్టుముట్టి దాడి చేశారు. ఆపై వారిని బంధించారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డారు. అయితే.. 

ఈ విషయం తెలుసుకున్న జోరాత్ పోలీసులు వెంటనే మోకోక్‌చంగ్ ఎస్పీతో మాట్లాడారు. దీంతో ఆయన స్థానికుల చేతుల్లో బందీలుగా ఉన్న పోలీసులను విడిపించేందుకు మరో బృందాన్ని పంపించారు. స్థానికులకు అసలు విషయం తెలియడంతో గాయపడిన పోలీసు సహా ఐదుగురిని విడిచిపెట్టారు. మిగిలిన 11 మందిని రాతంత్రా బందీలుగా ఉంచుకుని నిన్న ఉదయం విడిచిపెట్టడంతో కథ సుఖాంతమైంది.

Advertisement
 
Advertisement
Advertisement