Budget 2024: గంటన్నరలోపే బడ్జెట్‌ స్పీచ్‌ | 2024 Budget Speech Is Shortest Of Nirmala Sitaraman Budget Speeches | Sakshi
Sakshi News home page

Budget 2024: 86 నిమిషాల్లోనే బడ్జెట్‌ ప్రసంగం ముగింపు

Jul 23 2024 4:55 PM | Updated on Jul 23 2024 6:57 PM

2024 Budget Speech Is Shortest Of Nirmala Sitaraman Budget Speeches

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ స్పీచ్‌ సమయాన్నిగణనీయంగా తగ్గించుకున్నారు. మంగళవారం(జులై 23) పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మల తన స్పీచ్‌ను కేవలం 86 నిమిషాల్లోనే ముగించారు. 

ఆర్థిక శాఖ మంత్రిగా ఇదే ఆమె అతి చిన్న బడ్జెట్‌ ప్రసంగం కావడం గమనార్హం. 2020లో ఆమె ఏకంగా రెండు గంటల నలభై నిమిషాల పాటు అత్యంత ఎక్కువ సమయం బడ్జెట్‌ ప్రసంగం చేశారు. నిర్మల తొలిసారి ఆర్థిక మంత్రి అయిన 2019లోనూ 2 గంటల 17 నిమిషాలు, 2021లో గంట 50 నిమిషాలు, 2022లో గంట 32 నిమిషాలు, 2023లో గంటగ 27 నిమిషాలు బడ్జెట్‌ ప్రసంగాలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement