మావోయిస్టుల వాల్‌పోస్టర్ల విడుదల | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల వాల్‌పోస్టర్ల విడుదల

Published Sat, Nov 18 2023 1:26 AM

గ్రామ పంచాయతీ గోడపై వాల్‌పోస్టర్‌  - Sakshi

ఏటూరునాగారం: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకుల ఫొటోలతో కూడిన వాల్‌ పోస్టర్లను పోలీసులు శుక్రవారం విడుదల చేశారు. గ్రామంలోని పురవీధుల్లో బస్టాండ్‌, గ్రామ పంచాయతీ, తదితర ప్రాంతాల్లో వాల్‌పోస్టర్లను అంటించారు. ఏఎస్పీ సంకీర్త్‌ ఆదేశాల మేరకు సీఐ రాజు, ఎస్సై కృష్ణప్రసాద్‌ వాల్‌పోస్టర్లను గోడలపై అంటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ వాల్‌ పోస్టర్‌లో మావోయిస్టు పార్టీ నాయకుల పేర్లు, వారిపై ఉన్న రివార్డులు, ఇతర వివరాలను వివరించారు. ఎవరికై నా సమాచారం తెలిస్తే 100కు, స్థానిక పోలీసులకు కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement