సల్మాన్‌ రేస్‌లో లేరా? | Will Salman Khan be a part of Race 4 | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ రేస్‌లో లేరా?

Jun 25 2024 12:05 AM | Updated on Jun 25 2024 11:14 AM

Will Salman Khan be a part of Race 4

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ‘రేస్‌’లో లేరా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ‘రేస్‌’ మూవీ ఫ్రాంచైజీలో ఇప్పటికే మూడు సినిమాలు (2008లో ‘రేస్‌’, 2013లో ‘రేస్‌ 2’, 2018లో ‘రేస్‌ 3’) వచ్చి, బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. దీంతో ఈ ఫ్రాంచైజీలో రానున్న నాలుగో సినిమాపై ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. ‘రేస్, రేస్‌ 2’ చిత్రాలకు అబ్బాస్‌–మస్తాన్‌ దర్శకత్వం వహించగా, ‘రేస్‌ 3’కి రెమో డిసౌజా దర్శకత్వం వహించారు.

‘రేస్‌ 3’లో సల్మాన్‌ ఖాన్, అనీల్‌ కపూర్, బాబీ డియోల్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, డైసీ షా కీలక పాత్రలు పోషించారు. 2018 రంజాన్‌ సందర్భంగా రిలీజైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో ‘రేస్‌ 4’ పై ఎలాంటి అప్‌డేట్‌ వస్తుందా? అని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు నిర్మాత రమేశ్‌ ఎస్‌. తౌరానీ ఓ స్పష్టత ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ– ‘‘రేస్‌’ ఫ్రాంచైజీలో రానున్న నాలుగో చిత్రానికి ఇప్పటికే కథ సిద్ధంగా ఉంది. ఇందులో నూతన నటీనటులు ఉంటారు.

‘రేస్‌ 4’లో సల్మాన్‌ ఖాన్‌ భాగమవుతాడా? లేదా అనేది ఇప్పుడే చెప్పలేను. ఈ మూవీకి దర్శకుడు ఎవరన్నది కూడా ఇంకా నిర్ణయించలేదు. ఈ ఏడాది చివరికల్లా ఈ ్రపాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళుతుంది’’ అన్నారు. మరి ‘రేస్‌ 4’లో సల్మాన్‌ భాగమవుతారా? లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement