తంగలాన్‌ గురించి బిగ్‌ సీక్రెట్‌ రివీల్‌ చేసిన విక్రమ్‌ | Chiyaan Vikram Reveals Thangalaan Movie Secret | Sakshi
Sakshi News home page

Thangalaan: తంగలాన్‌ గురించి బిగ్‌ సీక్రెట్‌ రివీల్‌ చేసిన విక్రమ్‌

Nov 2 2023 7:13 AM | Updated on Nov 2 2023 8:50 AM

Vikram Reveal Thangalaan Movie Secret - Sakshi

చియాన్‌ విక్రమ్‌ నటించిన తంగలాన్‌ కోసం సౌత్‌ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో పార్వతి, మాళవిక మోహన్‌, పశుపతి ముఖ్యపాత్రలు పోషించారు. పా.రంజిత్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన తంగలాన్‌ టీజర్‌ ప్రేక్షకులను మెప్పిస్తుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. టీజర్‌లో విక్రమ్‌ చాలా వైల్డ్‌గా కనిపించాడు.

ఇందులో ఎలాంటి డైలాగ్స్‌ లేకుండా టీజర్‌ను చూపించారు. కానీ యాక్షన్‌ సీన్స్‌,బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదిరిపోయాయని చెప్పవచ్చు. టీజర్‌లో పామును పట్టుకుని చేతితోనే విక్రమ్‌ రెండు ముక్కలు చేస్తాడు.. ఈ సీన్‌ భారీగా వైరల్‌ అవుతుంది. టీజర్ విడుదల చేసిన తర్వాత తంగలాన్‌ గురించి విక్రమ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఆయన రివీల్‌ చేశాడు. ఈ సినిమాలో ఎక్కడా కూడా విక్రమ్‌కు డైలాగ్స్ ఉండవట. గతంలో శివపుత్రుడు  చిత్రంలో కూడా ఆయనకు ఎలాంటి డైలాగ్స్‌ లేవు కానీ తన నటనతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు.

ఆ సినిమాతోనే తెలుగులో ఆయనకు క్రేజ్‌ పెరిగింది. టాలీవుడ్‌ గురించి విక్రమ్‌ ఇలా అన్నాడు. 'తెలుగు అభిమానులకు సినిమా అంటే ఎంత అభిమానమో నాకు తెలుసు.. కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా వారు ఆదరిస్తారు. దానికి నిదర్శనమే శివపుత్రుడు. ఆ సినిమాను వారు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. ఆ సినిమా నాకు ఎంతపేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు తంగలాన్‌ కూడా అంతే పేరు తెస్తుంది. ఈ చిత్రంలో నాకు ఎలాంటి డైలాగ్స్‌ లేవు.. అంతా అరవడమే. దానికి కారణం ఉంది. అదేంటో సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. శివపుత్రుడు మాదిరే తంగలాన్‌లో కూడా ఎలాంటి డైలాగ్స్ ఉండవు.' అని విక్రమ్‌ తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement