విక్రమ్‌కు అవమానకరమైన ప్రశ్న.. సమాధానం అదుర్స్‌ | Vikram Comments On Top Stars In Kollywood | Sakshi
Sakshi News home page

విక్రమ్‌కు అవమానకరమైన ప్రశ్న.. సమాధానం అదుర్స్‌

Aug 12 2024 5:18 PM | Updated on Aug 12 2024 6:41 PM

Vikram Comments On Top Stars In Kollywood

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విక్రమ్ ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన తంగలాన్‌ సినిమా ప్రమోషనల్ టూర్‌లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న విడుదల కానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఒక ప్రెస్ మీట్‌లో విక్రమ్‌ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఎదురైనా తనదైన స్టైల్లో చెప్పి అందరినీ మెప్పించాడు.కోలీవుడ్‌లో సూర్య,అజిత్, విజయ్‌ వంటి స్టార్స్‌కు ఉన్నంత రేంజ్‌లో మీకు అభిమానులు ఉన్నారా..? అని ఒక పాత్రికేయుడు అడిగాడు. అందుకు విక్రమ్‌ ఇలా రియాక్ట్‌ అయ్యాడు.

నా ఫ్యాన్స్‌ బలం ఎంటో తెలుసుకోవాలంటే..
కోలీవుడ్‌లో విజయ్‌, సూర్య, అజిత్‌లకు ఉన్నంత అభిమానులు మీకు లేరు కదా అంటూ  విక్రమ్‌పై విలేకరుల వేసిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా వైరల్‌ అవుతుంది.  'నా అభిమానుల గురించి మీకు ఏమీ తెలియదు అనుకుంటున్నాను. సినీ అభిమానులంతా నా అభిమానులే. అందుకు రుజువు కావాలంటే ఆగష్టు 15న థియేటర్‌కి రండి.. సినిమా చూసి నా అభిమానుల బలం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడండి. అప్పుడు మీకే తెలుస్తుంది. టాప్ 3, టాప్ 4, టాప్ 5 అంటూ నాకు కొలమానం లేదు. ఏది ఏమైనా ఆరోజు మీరు థియేటర్‌కి వస్తారని ఆశిస్తున్నాను. నా అసిస్టెంట్‌కి మీ నంబర్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ టాపిక్‌ గురించి తర్వాత మాట్లాడుకుందాం. 

మీరు థియేటర్‌కు వచ్చి నా అభిమానులను చూస్తే.. ఏదోరోజు ఆ స్టార్స్‌ను కడా ఇదే ప్రశ్న అడుగుతారు. నా అభిమానుల గురించి మీకు ఏమీ తెలియదు కాబట్టే ఇలాంటి ప్రశ్న అడిగారు. నాకు టాప్ హీరో లిస్ట్‌లో ఉండటం ముఖ్యం కాదు. ప్రేక్షకులే ముఖ్యం.  ధూల్, సామి లాంటి సినిమాలు ఎలా తీయాలో నాకు తెలుసు, తంగలాన్ కోసం నా బెస్ట్ ఇచ్చాను. నా విషయానికొస్తే అందరూ ఏదో ఒక విధంగా నా అభిమానులే.' అని విక్రమ్ బదులిచ్చారు.

ఇతర హీరోల అభిమానులు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. అదే, విక్రమ్‌ను అయితే ఎవరూ ద్వేషించేవారు లేరని ఆ వేదిక మీద చర్చజరిగింది. విక్రమ్ భారీ స్టార్ కాదనే సూచనపై అభిమానులు విరుచుకుపడ్డారు. ఒక అభిమాని ఇలా వ్యాఖ్యానించాడు, చియాన్ లాంటి లెజెండ్‌కు చాలా అసహ్యకరమైన, అమర్యాదకరమైన ప్రశ్న వేస్తారా అంటూ తమిళ జర్నలిస్ట్‌పై ఫైర్‌ అయ్యాడు. తంగలాన్‌ సినిమా కోసం అతను డీ గ్లామర్‌ పాత్రలో కనిపించాడు. అంతే కాకుండా సుమారు 15కేజీల బరువు తగ్గాడు. సినిమా కోసం ఎన్నో కఠినమైన కష్టాలను అనుభవించాడు.. అసలు సిసలైన స్టార్‌ అంటే విక్రమ్‌ అని, దానిని  మీడియా ప్రతినిధులు గుర్తించకపోవడం ఆపై ఇలా అసహ్యకరమైన ప్రశ్నలు అడగడం ఏంటీ అంటూ నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement