Actor Vijay Sethupathi Interesting Comments About His Political Entry, Deets Inside - Sakshi
Sakshi News home page

Vijay Sethupathi : విజయ్‌ సేతుపతి రాజకీయాల్లోకి వస్తున్నారా? ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Apr 1 2023 3:24 PM | Updated on Apr 1 2023 3:35 PM

Vijay Sethupathi Intresting Comments About Political Entry - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి తాజాగా తమిళనాడు రాజకీయాలపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ 70వ పుట్టినరోజును పురస్కరించుకొని చెన్నైలోని తేనాంపేటలో 'స్టాలిన్ 70' పేరుతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు స్టార్‌ నటీనటులు హాజరయ్యారు. విజయ్‌ సేతుపతి కూడా అక్కడికి విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి యువత రాజకీయాల గురించి తెలుసుకోవాలని, తనకు రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉందని తెలిపారు. అయితే ప్రత్యేక రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మాత్రం ఇప్పుడు లేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేము అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో త్వరలోనే విజయ్‌ సేతుపతి పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నారనే అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


 

Advertisement
 
Advertisement
Advertisement