విజయ్- సమంత 'ఖుషి'.. టైటిల్ సాంగ్ వచ్చేసింది! | Vijay and Samantha Khushi Title Song Released Today | Sakshi
Sakshi News home page

Khushi: విజయ్- సమంత 'ఖుషి'.. టైటిల్ సాంగ్ రిలీజ్!

Sep 6 2023 6:56 PM | Updated on Sep 6 2023 7:05 PM

Vijay and Samantha Khushi Title Song Released Today - Sakshi

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన తాజా చిత్రం 'ఖుషి'. సెప్టెంబర్‌ 1న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. లైగర్ డిజాస్టర్‌ తర్వాత సూపర్‌ హిట్‌ కావడంతో విజయ్ సైతం ఎమోషనల్‌ అయ్యారు. శివనిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి మూడో రోజుల్లోనే రూ.70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఓవర్సీస్‌లో వన్ మిలియన్ డాలర్లను మార్కును దాటేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. 

(ఇది చదవండి: తగ్గేదేలే అంటున్న ఖుషి.. మూడో రోజు అదే జోరు!)

'ఖుషి.. నువ్వు కనబడితే.. ఖుషి.. నీ మటా వినపడితే..' అంటూ సాగే సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. కాగా.. కశ్మీర్ బ్యాప్‌ డ్రాప్‌లో తెరకెక్కించి రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. మూవీ హిట్ కావడంతో కుటుంబ సమేతంగా వెళ్లి యాదాద్రి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, శరణ్య పొన్వన్నన్, మురళీ శర్మ కూడా కీలక పాత్రల్లో నటించారు. 

(ఇది చదవండి: బాక్సాఫీస్‌ వద్ద ‘ఖుషి’ జోరు.. ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే?)

Advertisement
 
Advertisement
Advertisement