Vijay 60: Nanban Combo Repeat?, Here Answer - Sakshi
Sakshi News home page

Vijay : ఓపక్క పొలిటికల్‌ ఎంట్రీ.. మరోపక్క సినిమాలు.. విజయ్‌ దారెటు?

Jul 14 2023 12:22 PM | Updated on Jul 14 2023 7:22 PM

Vijay 60: Nanban Combo Repeat? - Sakshi

హిందీ చిత్రం 3 ఇడియట్స్‌ చిత్రానికి రీమేక్‌. కాగా మళ్లీ శంకర్‌ విజయ్‌ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం.

నన్బన్‌ చిత్ర కాంబో రిపీట్‌ కానుందా అంటే ? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్, దళపతి విజయ్, శ్రీకాంత్, జీవా, ఇలియానాలో కాంబినేషన్‌లో ఇంతకుముందు రూపొందిన హిట్‌ చిత్రం నన్బన్‌. ఇది హిందీ చిత్రం 3 ఇడియట్స్‌ చిత్రానికి రీమేక్‌. కాగా మళ్లీ శంకర్‌ విజయ్‌ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం.

విజయ్‌ త్వరలో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తన 68వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీని తర్వాత నటనకు గ్యాప్‌ ఇచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం వాడివేడిగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని విజయ్‌ వర్గం ఖండిస్తోంది. విజయ్‌ నటిస్తూనే రాజకీయాల్లో ఉంటారని ఆయన అభిమాన వర్గాలు పేర్కొంటున్నారు.

ఇకపోతే దర్శకుడు శంకర్‌ ప్రస్తుతం కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తున్న ఇండియన్‌– 2 చిత్రాన్ని, అదేవిధంగా తెలుగులో రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రాలు పూర్తయిన తర్వాత విజయ్‌ హీరోగా నటించే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. విజయ్‌ కోసం రాజకీయ థ్రిల్లర్‌ కథా చిత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర వన్‌ లైన్‌ కథను విజయ్‌కు చెప్పినట్లు, ఇంప్రెస్‌ అయిన విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం! ఇది విజయ్‌ నటించే 70వ చిత్రం అవుతుందని, దీనికి ముందు అట్లీ దర్శకత్వంలో విజయ్‌ నటించే అవకాశం ఉందని సమాచారం.

చదవండి: అచ్చం తండ్రిలానే ఉన్నాడు.. వైరలవుతున్న తారకరత్న ఫోటో

Advertisement
 
Advertisement
Advertisement