యాక్షన్‌.. ఎమోషన్‌ | Victory Venkatesh Saindhav Look Release | Sakshi
Sakshi News home page

యాక్షన్‌.. ఎమోషన్‌

Aug 14 2023 12:25 AM | Updated on Aug 14 2023 12:25 AM

Victory Venkatesh Saindhav Look Release - Sakshi

వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న ‘సైంధవ్‌’ సినిమా క్లైమాక్స్‌ షెడ్యూల్‌ పూర్తయింది. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా కీలక పాత్రలు చేస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ అయింది. ఈ సందర్భంగా యూనిట్‌ వెంకటేష్‌ లుక్‌ని రిలీజ్‌ చేసింది. ‘‘వెంకటేష్‌ కెరీర్‌లో 75వ చిత్రంగా ‘సైంధవ్‌’ రూపొందుతోంది.

హీరోతో పాటు ఎనిమిది మంది ముఖ్య నటీనటులపై 16 రోజుల్లో కీలకమైన హై యాక్షన్‌– ఎమోషనల్‌ క్లైమాక్స్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. యాక్షన్‌ ఎపిసోడ్‌ను రామ్‌–లక్ష్మణ్‌ మాస్టర్స్‌ సూపర్‌వైజ్‌ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో  క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 22న ఈ మూవీ రిలీజ్‌ కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణ్, సహ నిర్మాత: కిషోర్‌ తాళ్లూరు, కెమెరా: ఎస్‌.మణికందన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌ వెంకటరత్నం (వెంకట్‌).

Advertisement
 
Advertisement
Advertisement