జైలర్‌ సక్సెస్‌ తర్వాత టెన్షన్‌లో రజనీకాంత్‌ | Vettaiyan: Rajinikanth dances to Manasilayo Talks About Tension | Sakshi
Sakshi News home page

స్టేజీపై రజనీకాంత్‌ స్టెప్పులు.. ఒత్తిడికి లోనవుతున్నానంటూ కామెంట్స్‌

Sep 21 2024 8:17 PM | Updated on Sep 21 2024 8:23 PM

Vettaiyan: Rajinikanth dances to Manasilayo Talks About Tension

సినిమా స్టార్లకు హిట్టు వచ్చినా బాధే, ఫ్లాప్‌ వచ్చినా బాధే! హిట్టు వచ్చిందంటే దాన్ని అలాగే కొనసాగించాలని, వీలైతే సూపర్‌ హిట్‌ కొట్టాలన్న ఒత్తిడి ఉంటుంది. అదే ఫ్లాప్‌ వచ్చిందంటే నానామాటలు, విమర్శలు.. ఈసారైనా గట్టి కమ్‌బ్యాక్‌ ఇవ్వాలన్న ఒత్తిడి ఉంటుంది. నటుడి జీవితం ఇంతే! అంటున్నాడు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.

రజనీ స్టెప్పులు
ప్రస్తుతం రజనీకాంత్‌.. వేట్టైయాన్‌, కూలీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వేట్టైయాన్‌ మూవీ ఆడియో లాంచ్‌ శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో రజనీ స్పీచ్‌తో సరిపెట్టకుండా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుద్‌ రవిచందర్‌తో కలిసి స్టెప్పులేశాడు. మనసిలాయో.. పాటలోని హుక్‌ స్టెప్‌ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏ రకంగా చూసినా ఒత్తిడి తప్పదు
ఆడియో లాంచ్‌లో రజనీ మాట్లాడుతూ.. ఏదైనా సినిమా ఫ్లాప్‌ అయిందంటే నెక్స్ట్‌ ఎలాగైనా హిట్‌ కొట్టాలన్న టెన్షన్‌ ఉంటుంది. అలాగే ఒక సినిమా సక్సెస్‌ అయిందంటే తర్వాతి చిత్రాలు కూడా హిట్టవ్వాలని, అవసరమైతే అంతకంటే ఇంకా పెద్ద విజయం సాధించాలన్న ఒత్తిడి ఉంటుంది. అందరూ అదే కోరుకుంటారు. జైలర్‌ సినిమా ఘన విజయం తర్వాత నాపై ఇలాంటి ఒత్తిడే ఉంది అని రజనీకాంత్‌ పేర్కొన్నాడు.

అప్పుడే రిలీజ్‌
ఇకపోతే వేట్టైయాన్‌ సినిమాలో రానా, ఫహద్‌, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ వంటి పలువురు కీలక పాత్రల్లో నటించారు. అమితాబ్‌ బచ్చన్‌ సైతం ముఖ్య పాత్రలో మెప్పించనున్నాడు. టీజే జ్ఞానవేల్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీ అక్టోబర్‌ 10న విడుదల కానుంది.

 

 

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement