వేట్టయాన్‌ కలెక్షన్స్‌.. మ్యాజిక్‌ నంబర్‌కు దగ్గర్లో రజనీకాంత్‌ | Vettaiyan Movie 3 Days Collections | Sakshi
Sakshi News home page

వేట్టయాన్‌ కలెక్షన్స్‌.. మ్యాజిక్‌ నంబర్‌కు దగ్గర్లో రజనీకాంత్‌

Oct 13 2024 2:26 PM | Updated on Oct 13 2024 3:07 PM

Vettaiyan Movie 3 Days Collections

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘వేట్టయాన్‌’ బాక్సాఫీస్‌ వద్ద వీకెండ్‌లో మంచి కలెక్షన్లతో సత్తా చాటుతుంది. అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, కిశోర్‌, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజయ్‌, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది.

రజనీకాంత్ వేట్టయాన్‌ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ145.80 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిందని ప్రముఖ ట్రేడ్‌ సంస్థ తెలిపింది. మ్యాజిక్‌ నంబర్‌ రూ. 150 కోట్లకు చాలా దగ్గరలో కలెక్షన్లు ఉన్నాయి. నేటి కలెక్షన్లతో సులువుగా దానిని రజనీ అదిగమిస్తాడని చెప్పవచ్చు. కోలీవుడ్‌లో 2024లో విడుదలైన చిత్రాల్లో కలెక్షన్ల పరంగా వేట్టయాన్‌ 5వ స్థానంలో ఉంది. దసరా సందర్భంగా రజనీకాంత్‌ సినిమాకు శనివారం నాడు మంచి కలెక్షన్స్‌ వచ్చాయని తెలుస్తోంది.

కోలీవుడ్‌లో సినిమా ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా కూడా వేట్టయాన​్‌ కలెక్షన్ల గురించి ఒక ట్వీట్‌ చేశాడు. ఈ చిత్రం ఉత్తర అమెరికాలో రూ. 17 కోట్ల  గ్రాస్ మార్క్‌ను దాటిందని పేర్కొన్నాడు. అమెరికాలో ఇప్పటి వరకు  ఈ మార్క్‌ను అందుకున్న రజనీ సినిమాలు రోబో,2.0,కబాలి,పేట,దర్బార్‌, జైలర్‌  మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో వేట్టయాన్‌ కూడా చేరిందని ఆయన తెలిపాడు. ఈ చిత్రం సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేయవచ్చని ఆయన తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement