క్రిస్మస్‌ కానుక | Venkatesh's Saindhav To Explode For Christmas | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ కానుక

Mar 30 2023 12:49 AM | Updated on Mar 30 2023 12:49 AM

Venkatesh's Saindhav To Explode For Christmas - Sakshi

హీరో వెంకటేశ్‌ సినీ అభిమానులకు, ప్రేక్షకులకు క్రిస్మస్‌ కానుక ఇవ్వనున్నారు. ఆయన నటిస్తున్న ‘సైంధవ్‌’ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకులముందుకు తీసుకొస్తున్నారు. ‘హిట్‌’ మూవీ ఫ్రాంచైజీ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకటేశ్‌ నటిస్తున్న చిత్రం ‘సైంధవ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

కాగా ‘సైంధవ్‌’ ని క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 22న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించి, వెంకటేశ్‌ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘ఇటీవల మొదలైన ఈ లాంగ్‌ షెడ్యూల్‌లో వెంకటేశ్‌తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది. నవాజుద్దీన్‌ సిద్ధిఖి కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు సంగీతం: సంతోష్‌ నారాయణ్, సహ నిర్మాత: కిషోర్‌ తాళ్లూరు, కెమెరా:ఎస్‌. మణికందన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. వెంకటరత్నం.

Advertisement
 
Advertisement
Advertisement