వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి డేట్ ఫిక్సయ్యిందా? | Varun Tej Lavanya Tripathi Marriage Date Rumours | Sakshi
Sakshi News home page

Varun Tej Marriage: మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు అప్పుడేనా?

Jul 20 2023 9:06 PM | Updated on Mar 1 2024 3:03 PM

Varun Tej Lavanya Tripathi Marriage Date Rumours - Sakshi

మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగేందుకు డేట్ ఫిక్సయ్యిందా అంటే.. అవుననే టాక్ వినిపిస్తోంది. జూన్ 9న నాగబాబు కొడుకు వరుణ్ తేజ్  ఎంగేజ్‌మెంట్ జరిగింది. గత కొన్నేళ్లుగా లవ్ చేస్తున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఉంగరాలు మార్చుకున్నాడు. ఈ విషయం మెగా ఫ్యాన్స్‌కి పెద్ద సర్‌ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ జంట పెళ్లి చేసుకోబోయే డేట్ ఇదేనని సోషల్ మీడియాలో ఓ టాక్ మొదలైంది.

(ఇదీ చదవండి: మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!)

మెగాఫ్యామిలీలో బోలెడంత మంది హీరోలున్నారు. వాళ్లందరిలో సమ్‌థింగ్ డిఫరెంట్ ఉండే మూవీస్ చేస్తూ వరుణ్ తేజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'గాండీవధారి అర్జున' అనే క్లాస్ యాక్షన్ చేస్తున్నాడు. ఇది ఆగస్టు 25న థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. మరోవైపు నిశ్చితార్థం చేసుకున్న వరుణ్-లావణ్య ఈ మధ్యే కాఫీ డేట్‌కి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోల‍్ని ఇన్ స్టాలో స్టోరీస్‌గా పెట్టారు.

జూన్‌లో వీళ్ల ఎంగేజ్‌మెంట్ జరిగినప్పుడే.. ఈ ఏడాదిలో పెళ్లి ఉంటుందని టాక్ వినిపించింది. ఇప్పుడు ఏకంగా డేట్ ఇదేనంటూ ఒకటి బయటకొచ్చింది. ఆగస్టు 24న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే పెళ్లి షాపింగ్ కూడా మొదలుపెట్టేశారని సమాచారం. అయితే సినిమా రిలీజ్ పెట్టుకుని వరుణ్.. ఆగస్టులో మ్యారేజ్ చేసుకుంటాడా? లేదా ఇదే జస్ట్ రూమర్ మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్)

Advertisement
 
Advertisement
Advertisement