నా కెరియర్‌లో ఎక్కువగా విజయ్‌తోనే పయనించా: త్రిష | Trisha Krishnan Comments On Thalapathy Vijay | Sakshi
Sakshi News home page

Trisha Krishnan: నా కెరియర్‌లో ఎక్కువగా విజయ్‌తోనే పయనించా: త్రిష

Nov 3 2023 6:41 AM | Updated on Nov 3 2023 8:23 AM

Trisha Krishnan Comments On Vijay - Sakshi

కోలీవుడ్‌లో ఇప్పుడు మంచి రైజింగ్‌లో ఉన్న నటి త్రిష. ఈ బ్యూటీ వయసు 40 ఏళ్లు. నటిగా 25 ఏళ్లకు దగ్గర్లో ఉన్నారు. అయినప్పటికీ అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. ఇప్పటికీ అవివాహితగా ఉన్న ఈమె ప్రముఖ నటులకు జంటగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల విజయ్‌కు జంటగా నటించిన లియో చిత్రం విడుదలై అనూహ్య వసూళ్లు సాధిస్తోంది. కాగా బుధవారం రాత్రి చైన్నెలో జరిగిన లియో చిత్ర విజయోత్సవ వేడుకలో పాల్గొన్న త్రిష మాట్లాడుతూ ఈ చిత్ర కథను దర్శకుడు రెండున్నర గంటల పాటు ఆయన చెప్పిన తీరు తనను ఆశ్చర్యానికి గురి చేసింది అన్నారు.

లోకేశ్‌ కనకరాజ్‌ అప్పుడు ఏం చెప్పారో దాన్ని తెరపై ఆవిష్కరించారని చెప్పారు. ఈ చిత్రంలో విజయ్‌ సరసన నటించడం మరిచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. స్కూల్లో చదువుకున్న వారు కొన్నేళ్ల తర్వాత కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి అనుభూతిని తాను అనుభవిస్తున్నట్లు చెప్పారు. తన కెరీర్లో తాను ఎక్కువగా పయనించింది విజయ్‌తో అని తెలిపారు. విజయ్‌ నెమ్మదితనమే ఆయన విజయానికి కారణంగా పేర్కొన్నారు. తనను కలిసే వారు.. స్నేహితులు మళ్లీ విజయ్‌కు జంటగా ఎప్పుడు నటిస్తారు అని పదేపదే అడుగుతుండే వారన్నారు.

అది ఇన్నాళ్లకు జరిగిందని, లియో చిత్రంలో విజయ్‌ తాను మళ్లీ జతకట్టామని చెప్పారు. 15 ఏళ్ల తర్వాత కూడా తమ జంట వర్కౌట్‌ అయిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నటీమనులకు ఉత్తాన్న పతనాలు ఉంటాయని, అయినప్పటికీ అన్నివేళలా సంతోషంగా ఉండాలన్నారు. తాను అలా ఉండటం వల్లే తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చానని త్రిష పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement