ప్రత్యేకంగా నీ బ్యాటింగ్‌ కోసమే వచ్చా బ్రో: విశ్వక్‌ సేన్ | Tollywood Young Hero Vishwaksen Funny Interaction With Nikhil | Sakshi
Sakshi News home page

నీ బ్యాటింగ్‌ కోసమే వచ్చా బ్రో.. విశ్వక్‌ సేన్ వీడియో వైరల్!

Mar 4 2024 6:15 PM | Updated on Mar 4 2024 7:35 PM

Tollywood Young Hero Vishwaksen Funny Interaction With Nikhil - Sakshi

ఇటీవల సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్) మ్యాచులు హైదరాబాద్‌లో నిర్వహించారు. మార్చి 1,2,3 తేదీల్లో వరుసగా మ్యాచులతో టాలీవుడ్ స్టార్స్.. ఇతర సినీ ఇండస్ట్రీ టీమ్స్‌ కూడా సందడి చేశాయి.  ఉప్పల్‌ స్డేడియం వేదికగా ఈ మ్యాచులు జరిగాయి. అయితే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మన తెలుగు వారియర్స్ టీమ్‌లో స్టార్‌ బ్యాటర్‌గా కొనసాగుతున్నారు. తాజాగా మన యంగ్ నిఖిల్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. విశ్వక్‌సేన్‌తో ఫన్నీగా సంభాషిస్తూ కనిపించారు. అదేంటో మీరు ఓ లుక్కేయండి.

ఇటీవల జరిగిన ఉప్పల్‌ మ్యాచ్‌లో యంగ్ హీరోలు నిఖిల్, విశ్వక్‌ సేన్‌ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నిఖిల్ బ్యాటింగ్‌ చూసేందుకు స్టేడియానికి వచ్చానని విశ్వక్‌ సేన్‌ చెప్పడంతో వీరిద్దరి మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. 'నిఖిల్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు.. నేను ప్రత్యేకంగా నిఖిల్ బ్యాటింగ్ కోసమే వచ్చా. బ్యాటింగ్ టిప్స్‌ బాగా తెలుసు. ఇటీవలే రిజల్ట్ కూడా వచ్చింది' అంటూ విశ్వక్‌ సేన్ నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను నిఖిల్, విశ్వక్‌ సేన్‌ తన ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. విశ్వక్ సేన్‌ నటించిన చిత్రం గామి ఈ వారం థియేటర్లలో సందడి చేయనుంది. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement