'టిల్లు స్క్వేర్‌' నుంచి అదిరిపోయే వీడియో సాంగ్‌ విడుదల | Ticket Eh Konakunda Full Video Song From Tillu Square Out Now, Watch Video Inside - Sakshi
Sakshi News home page

Ticket Eh Konakunda Video Song: 'టిల్లు స్క్వేర్‌' నుంచి అదిరిపోయే వీడియో సాంగ్‌ విడుదల

Apr 15 2024 4:51 PM | Updated on Apr 15 2024 5:41 PM

Ticket Eh Konakunda Full Video Song From Tillu Square Out Now - Sakshi

డీజే టిల్లుకు సీక్వెల్‌గా విడుదలైన 'టిల్లు స్క్వేర్‌' బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌తో దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్‌ అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మార్చి 29న విడుదలైన ఈ చిత్రాన్ని రెండోసారి కూడా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిచూపుతున్నారు. మొదటి పార్ట్‌కు మించిన ఫన్‌ ఈ చిత్రంలో ఉండటంతో యూత్‌కు బాగా దగ్గరైంది. 

సిద్దు తనదైన స్టైల్‌లో వన్ లైనర్ డైలాగ్స్‌తో సినిమాను దడదడలాడించేశాడు. కథకు తగ్గట్టు హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ కూడా చెలరేగిపోయింది. సినిమా విడుదలై మూడు వారాలు పూర్తి కావస్తుంది. దీంతో తాజాగా ఈ సినిమా నుంచి టికెట్టే కొనకుండా అనే వీడియో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. రామ్‌ మిరియాల ఈ పాటను పాడటమే కాకుండా మ్యూజిక్‌ను కూడా అందించారు.   ట్రెండింగ్‌ సాంగ్‌ కావడంతో ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. టిల్లు గాడి ఫన్‌కు మెచ్చిన ఆడియన్స్‌ ఇప్పటి వరకు రూ. 115 కోట్ల గ్రాస్‌ను కలెక్షన్స్‌ రూపంలో ఇచ్చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement