నా మనసుకు దగ్గరైన కథ ఇది

Thrilling Trailer Of My Name Is Shruthi Launched - Sakshi

హన్సిక

హన్సిక టైటిల్‌ రోల్‌ చేసిన ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వంలో బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్‌ కానుంది. శనివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు శ్రీనివాస్‌ గౌడ్, దర్శకుడు అశోక్‌ అతిథులుగా హాజరై, ఈ సినిమా హిట్టవ్వాలన్నారు. హన్సిక మాట్లాడుతూ– ‘‘మంచి థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ ఫిల్మ్‌ ఇది.

నా మనసుకు దగ్గరైన కథ. దర్శకుడు శ్రీనివాస్‌గారు ఎంతో కష్టపడ్డారు. ప్రభాకర్‌గారు రాజీ పడకుండా నిర్మించారు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులు నన్ను మరోసారి ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘నేను కొత్త దర్శకుడిని అయినా కథను నమ్మి, నన్ను ప్రోత్సహించిన హన్సికగారికి, సపోర్ట్‌ చేసిన ప్రభాకర్‌గారికి, సహకరించిన సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు.

శ్రీనివాస్‌ ఓంకార్‌. ‘‘ప్రత్యేక శ్రద్ధతో ఈ సినిమా చేసిన హన్సికకు థ్యాంక్స్‌’’ అన్నారు ప్రభాకర్‌. ఈ కార్యక్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ మార్క్‌ కె రాబిన్, ఎడిటర్‌ చోటా కె ప్రసాద్, కెమెరామేన్‌ కిశోర్, కో ప్రోడ్యూసర్‌ బండి పవన్‌ కుమార్, లైన్‌ ప్రోడ్యూసర్‌ విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top